Harish Rao Meets Kavitha: తీహార్ జైలులో కవితను పరామర్శించిన హరీష్ రావు
న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీకవితను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం కలిశారు.ఈ సందర్బంగా ఆమె యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్బంగా తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితిపై కవిత ఆరా తీసినట్లు సమాచారం.
Harish Rao Meets Kavitha: న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీకవితను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం కలిశారు.ఈ సందర్బంగా ఆమె యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్బంగా తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితిపై కవిత ఆరా తీసినట్లు సమాచారం.తెలంగాణ రాజకీయాలతో పాటు కుటుంబ సమస్యలపై కూడా వారు చర్చించినట్లు తెలిసింది.
జూలై 5 వరకు కస్టడీ పొడిగింపు..( Harish Rao Meets Kavitha)
ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆమె సోదరుడు కేటీఆర్ తో పాటు, మాజీ మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి మరియు సత్యవతి రాథోడ్ కూడా ఇటీవలి కాలంలో కవితను జైలులో కలిశారు.మార్చి 15న మద్యం కుంభకోణంలో అరెస్టయిన తర్వాత కవిత తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రూస్ అవెన్యూ కోర్టు జూలై 5 వరకు పొడిగించింది.అధికారులు ఆమెను జూన్ 21న కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు జూలై 3న కేసును మళ్లీ విచారించనుంది.మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.