Home / Tihar jail
ఢిల్లీ తీహార్ జైలు ఉన్నతాధికారులు మంత్రి సత్యేందర్ జైన్ తమను బెదిరించారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై డైరెక్టర్ జనరల్ (జైళ్లు)కు ఫిర్యాదు చేసారు.
ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు సెల్‌లో మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత, భారతీయ జనతా పార్టీ జైన్ బుధవారం సెల్ లోపల విలాసవంతమైన భోజనం చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
తీహార్ జైలులో ఉన్న ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్ మంచం మీద పడుకుని ఉండగా పాదాలకు మసాజ్ చేస్తున్నట్లు వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇది ఫిజియో ధెరపీ కాదని మసాజ్ చేసిన వ్యక్తి రింకు అనే పేరుగల వ్యక్తని జైలు వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలులో ఉన్న ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ కు వీఐపీ ట్రీట్ మెంట్ జరుగుతోందన్న ఆరోపణల పై అజిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు.
మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ జైలులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది.