NCP MLAs Disqualify Petition: ఎన్‌సిపి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..ఫిబ్రవరి 15 వరకు గడువు పొడిగింపు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన అంశాలపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సుప్రీంకోర్టు సోమవారం గడువును పొడిగించింది.

NCP MLAs Disqualify Petition:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన అంశాలపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సుప్రీంకోర్టు సోమవారం గడువును పొడిగించింది.
మూడు వారాల గడువు కావాలని.. (NCP MLAs Disqualify Petition)
శరద్ పవార్ వర్గం నుండి వచ్చిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా కోర్టు నిర్దేశించిన అసలు గడువు జనవరి 31. అయితే నార్వేకర్ పొడిగింపును అభ్యర్థించడంతో కోర్టు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది.అజిత్ పవార్ వర్గంపై ఉన్న అనర్హత పిటిషన్లపై సత్వర నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని, జోక్యం చేసుకోవాలని శరద్ పవార్ వర్గం నుండి సుప్రీం కోర్టును కోరింది.అజిత్ పవార్ వర్గంపై ఉన్న అనర్హత పిటిషన్లపై సత్వర నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని, జోక్యం చేసుకోవాలని శరద్ పవార్ వర్గంసుప్రీం కోర్టును కోరింది.నార్వేకర్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, శివసేన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్‌లను పరిష్కరించడంలో స్పీకర్ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారని కోర్టుకు తెలియజేశారు. ఎన్‌సిపి విషయంలో క్షుణ్ణంగా సమీక్షించి న్యాయమైన తీర్పు వచ్చేలా మూడు వారాల పొడిగింపును ఆయన కోరారు.
అక్టోబరు 2023లో, సుప్రీం కోర్టు స్పీకర్‌కు ఆదేశాన్ని జారీ చేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం జనవరి 31, 2024లోగా అనర్హత పిటిషన్లపై తీర్పు చెప్పాలని సూచించింది. ఎమ్మెల్యేల వర్గం నేతృత్వంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ పార్టీ ఫిరాయించారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలతో పొత్తు పెట్టుకున్నారు.
అజిత్ పవార్ , షిండే ప్రభుత్వంలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను దాఖలు చేయడంపై అధికారిక ఎన్సీపీ స్పందించింది. తనకు మెజారిటీ ఎన్‌సిపి ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తాను ‘నిజమైన’ ఎన్‌సిపికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని అజిత్ పవార్ పేర్కొన్నారు. జూలై 1 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్‌ను అసెంబ్లీలో ఎన్‌సిపి శాసనసభా పక్ష నేతగా నియమిస్తున్నట్లు ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. ప్రస్తుతం ఎన్సీపీ పార్టీ పేరు,దాని ఎన్నికల గుర్తుపై దావా వేయాలని కోరుతూ అజిత్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ఎన్నికల సంఘం విచారిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- Janasena Chief Pawan kalyan: ఎన్నికలముందు కులగణన ఎందుకు ? సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బహిరంగలేఖ
- CM Arvind Kejriwal: బీజేపీ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఆఫర్ చేసింది.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్