Published On:

Oppo Reno 12 Pro 5G Price Drop: వారెవ్వా తగ్గేదేలే.. ఒప్పో రెనో 5జీ ఫోన్‌పై రూ.17 వేల డిస్కౌంట్.. ఆఫర్ అదిరిందయ్యా..!

Oppo Reno 12 Pro 5G Price Drop: వారెవ్వా తగ్గేదేలే.. ఒప్పో రెనో 5జీ ఫోన్‌పై రూ.17 వేల డిస్కౌంట్.. ఆఫర్ అదిరిందయ్యా..!

Oppo Reno 12 Pro 5G Price Drop: ఒప్పో మూడు కొత్త ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఒప్పో వీటిని Find X8 సిరీస్ కింద పరిచయం చేస్తోంది. Oppo Find X8s, Oppo Find X8s Plus, Oppo Find X8 Ultra మొబైల్‌లు ఏప్రిల్ 10న అధికారికంగా విడుదల కానున్నాయి. ఈ ఫోన్‌ల విడుదలకు ముందే.. Oppo Reno 12 Pro 5G ధరను కంపెనీ తగ్గించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

 

Oppo Reno 12 Pro 5G Discount Offer
ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. రెనో సిరీస్ క్రింద దీనిని విడుదల చేశారు. ఇది ప్రస్తుతం భారీ తగ్గింపుతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. మొబైల్‌‌ని ప్రస్తుతం ఫ్లపి‌కార్ట్‌లో 31శాతం ప్రత్యక్ష తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. దీనిని రూ.53,999కి విడుదల చేశారు. మీరు ఈ ఫోన్‌ను లాంచ్ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే కేవలం రూ. 36,999కి కొనచ్చు. మొత్తంమీద రూ.17 వేల డిస్కౌంట్ లభిస్తుంది.

 

Oppo Reno 12 Pro 5G Features
ఒప్పో రెనో 12 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 94ppi పిక్సెల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియో, HDR10+ సపోర్ట్, 1200నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే‌కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్‌ ఉంది. మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఆర్మ్ మాలి G615 GPUని కూడా ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ColorOS 14.1ని రన్ చేస్తుంది. ఇందులో 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉన్నాయి. మీరు మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

 

ఒప్పో రెనో 12 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ మొబైల్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంది. దీనితో పాటు, రెండవ కెమెరాలో 50-మెగాపిక్సెల్ సామ్‌సంగ్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉంది. మూడవ కెమెరా 8-మెగాపిక్సెల్ సోనీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది ఆటో ఫోకస్, పోర్ట్రెయిట్ మోడ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 180W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. కనెక్టివిటీ ఎంపికల విషయానికొస్తే, ఇందులో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, GLONASS, గెలీలియో, USB టైప్-C మొదలైనవి ఉన్నాయి.