Garlic: వెల్లుల్లిని దూరం పెడుతున్నారా?.. ఆ పని మాత్రం చేయకండి
Garlic: మనం వంటల్లో వాడే వెల్లుల్లిని చాలా మంది దూరం పెడుతుంటారు. కొందరు దీనిని ఇష్టంగా తింటే.. మరికొందరు వీటి వాసన చూడటానికి కూడా భయపడుతారు. కానీ వెల్లుల్లి తింటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనే విషయం చాలామందికి తెలియదు.
Garlic: మనం వంటల్లో వాడే వెల్లుల్లిని చాలా మంది దూరం పెడుతుంటారు. కొందరు దీనిని ఇష్టంగా తింటే.. మరికొందరు వీటి వాసన చూడటానికి కూడా భయపడుతారు. కానీ వెల్లుల్లి తింటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనే విషయం చాలామందికి తెలియదు.
ఆరోగ్యం మెరుగు (Garlic)
మానవ జీవన విధానంలో చాలామంది కొన్ని రకాల ఆహారపదార్ధాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలను తింటుంటారు. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి.. అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా మంది కేవలం మాంసాహారం, చేపలు వంటివి తిన్నప్పుడు మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. కానీ అల్లం, వెల్లుల్లిని విడిగా రోజువాడితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలియదు. వెల్లుల్లిలో సమృద్ధిగా విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి వంటి పోషకాలెన్నో ఉంటాయి.
వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్లో చేర్చుకోవడం మంచిది. మనుషులకు ఇది మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థాలు తినేవారు వెల్లుల్లిని తప్పని సరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం లేదా ఇతర క్రొవ్వు పదార్ధాలలో ఉన్న కొవ్వుకు విరుగుడుగా ఇది పని చేస్తుంది. ముఖ్యంగా ఇది గుండె జబ్బులను నియంత్రిస్తుంది. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. వెల్లుల్లిని రోజూ వాడేవారు తక్కువగా అనారోగ్యం బారిన పడతారని డాక్టర్లు చెబుతున్నారు.
ఆయుర్వేదంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. దీనిని రసాయనంగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు.
పక్షవాతం, కుష్ఠు, గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు, జ్వరము, జీర్ణాశయ వ్యాధులు మొదలైన అనేక వ్యాధులలో వెల్లుల్లికి మించిన ఔషధం లేదు.
వెల్లుల్లి అత్యుత్తమమైన జీర్ణకారిగా పనిచేస్తుంది. గుండె జబ్బులు కలవారు బాగా లావుగా ఉన్నవారు ప్రతిరోజూ రెండు లేక మూడు చిన్నపాయలను తీసుకుంటే లావు తగ్గుతారు.
స్త్రీలలో కలిగే వ్యాధులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. ఋతు దోషములను పోగొట్టి సంతానాన్ని కలిగిస్తుంది.
ఊపిరితిత్తుల వ్యాధులలో వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన ఆస్త్మా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది.
పిల్లలకు ఔషదం..
చర్మానికి కాంతి రావాలంటే.. వెల్లుల్లిని వాడాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.
అలాగే వెల్లుల్లిపాయలను దంచి ఆ రసాన్ని 10 చుక్కల చొప్పున రోజుకి రెండు సార్లు తాగిస్తే పిల్లలకు కలిగే కోరింత దగ్గు తగ్గుతుంది.
శుక్రకణాలు తక్కువగా ఉండి, సంతాన సాఫల్యత కోసం ఎదురుచూసే వారు వెల్లుల్లిని ఎక్కువగా వాడమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. చాలామంది చెవిపోటుతో బాధపడుతూ ఉంటారు.
అలాంటివారు వెల్లుల్లిని వాడితే చెవిపోటు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఏ పదార్ధాన్ని ఎక్కువగా తీసుకోకూడదు.
వెల్లుల్లి అతిగా తింటే రక్తస్రావం, రక్తంతో కూడిన వాంతులు, రక్త విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగు మోతాదులో జాగ్రత్తగా సేవిస్తే అమృతంలా పనిచేస్తుంది.
మన శరీరం తత్వాన్ని బట్టి వెల్లుల్లిని సేవించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.