Brinjal: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయా.. వంకాయ తినడం మానుకోండి
Brinjal: కూరగాయలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు వంకాయ. కూరగాయల్లో రాజు ఎవరంటే.. ప్రతి ఒక్కరు చెప్పేది వంకాయ గురించే. మరి ఈ వంకాయతో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మీకు తెలుసా.?
Brinjal: కూరగాయలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు వంకాయ. కూరగాయల్లో రాజు ఎవరంటే.. ప్రతి ఒక్కరు చెప్పేది వంకాయ గురించే. మరి ఈ వంకాయతో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మీకు తెలుసా.? కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మరి ఆ ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం.
వంకాయ ప్రత్యేకత వేరు.. (Brinjal)
కూరగాయలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు వంకాయ. కూరగాయల్లో రాజు ఎవరంటే.. ప్రతి ఒక్కరు చెప్పేది వంకాయ గురించే. తెలుగు రాష్ట్రాల్లో వంకాయ కూరకు ఉండే ప్రత్యేకతే వేరు. వంకాయ.. వంకాయ ఫ్రై, గుత్తొంకాయ ఇలా రకరకాల వంటలు చేస్తారు. ఇక కొందరికి ఉల్లి కారం పెట్టిన గుత్తి వంకాయ అంటే నోరు ఊరాల్సిందే.
అయితే వంకాయతో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
వంకాయలో ఉండే విటమిన్లు.. ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
కానీ ఇది కొంతమందికి.. రియాక్టివ్ ప్రభావాలను కలిగిస్తుంది. కావున ఇదే దీనిని తినే విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి.
ప్రస్తుత కాలంలో చాలమంది జీర్ణవ్యవస్థ ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అలాంటి వారు దీనికి దూరంగా ఉండటం మంచిది.
బలహీనమైన జీర్ణవ్యవస్థ, నెమ్మదిగా జీర్ణక్రియ కలిగినవారు వంకాయ తినకుండా ఉండాలి. ఇది జీర్ణక్రియను అధ్వాన్నంగా చేస్తుంది. దీనిక ప్రధాన కారణం.. ఇది గ్యాస్ ను సృష్టిస్తుంది.
కొందరికి చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటి వారు కూడా దీనికి దూరంగా ఉండటం మంచిది.
ఎలాంటి చర్మ అలెర్జీలు వచ్చినా, వంకాయ తినకూడదని వైద్యులు హెచ్చరిస్తారు. ఇది మీ సమస్య తీవ్రతను పెంచే అవకాశం ఉంటుంది.
డిప్రెషన్, ఆందోళన కారణంగా మాత్రలు తీసుకుంటుంటే వంకాయ తినకూడదు. అది దాటితే మీ ఒత్తిడి పెరుగుతుంది.
ఇది మాత్ర యొక్క శక్తిని కూడా పలుచన చేస్తుంది.
రక్తహీనతతో బాధపడేవారు కూడా తినకపోవడం మంచింది. రక్తం తక్కువగా ఉన్నప్పుడు రక్తహీనత వస్తుంది.
వంకాయను ఎక్కువగా తింటే.. రక్త ఉత్పత్తిని నిరోధించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి రక్తహీనత ఉన్నవారు వంకాయలకు దూరంగా ఉండటం మంచిది.
దురద, చికాకు, దృష్టి లోపం, కళ్ల చుట్టూ వాపు వంటి సమస్యలు ఉంటే వంకాయ తినకూడదు.
చాలామంది మూలవ్యాధితో బాధపడుతున్నారు. ఆ సమస్యను వంకాయ ఇంకా తీవ్రతరం చేస్తుంది. కాబట్టి దూరంగా ఉండాలి.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వంకాయను కూడా ముట్టుకోకూడదు. వంకాయలోని ఆక్సలేట్లు మీ రాతి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి