Cs Somekh Kumar: సీఎస్ సోమేష్ కుమార్ కు కేంద్రం షాక్.. తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు
Cs Somekh Kumar: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమేష్‌కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసిన రోజే.. కేంద్రం మరో షాక్ ఇచ్చింది. సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఐఏఎస్ ల విభజన సమయంలో సోమేష్ ను ఏపీకి కేటాయించగా.. క్యాట్ మినహాయింపుతో తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఏపిలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు
దీనిపై స్పందించిన DOPT తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై సీఎస్ సోమేష్ కుమార్ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం ఇష్టం లేని సోమేష్ కుమార్(CS Somesh Kumar) తనను తెలంగాణకే కేటాయించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్యాట్ లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ తర్వాత ఆయన్ని ఏపీకి వెళ్లాల్సిందేనంటూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 2017లో మళ్లీ ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
2019లో అప్పటి చీఫ్ సెక్రటరీ జోషి రిటైరయిన తరువాత 14 మంది స్పెసల్ చీప్ సెక్రటరీలు ఈ పదవి కోసం పోటీపడ్డారు. సీఎం కేసీఆర్ సోమేష్‌కుమార్ వైపు మొగ్గు చూపారు. 1989 బ్యాచ్‌కు చెందిన సోమేష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖతో పాటు పలు కీలకమైన శాఖల్లో పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
CCTV: హైదరాబాద్‌లో పిల్లిని ఎత్తుకుపోతున్న దొంగ.. CCTV ఫుటేజ్ వైరల్
Khammam Politics: ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్
Constable Leave Letter: సార్ నా భార్య అలిగింది.. బుజ్జగించడానికి లీవ్ ఇవ్వండి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/