IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Gujarat Titans vs Rajasthan Royals in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్‌లో 23వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మరో రెండు మ్యాచ్‌లలో ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ఏడో స్థానంలో ఉంది. ఇక, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు జరగాయి. ఇందులో గుజరాత్ ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్థాన్ ఒక్క మ్యాచ్‌లో నెగ్గింది.
గుజరాత్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), రూథర్ ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్ మయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, ఫారూఖీ, సందీప్ శర్మ, దేశ్ పాండే.