Published On:

Akkada Ammayi Ikkada Abbayi: ప్రదీప్‌కి పెద్ది సాయం.. కానీ, ఆలస్యమైపోయిందే

Akkada Ammayi Ikkada Abbayi: ప్రదీప్‌కి పెద్ది సాయం.. కానీ, ఆలస్యమైపోయిందే

Akkada Ammayi Ikkada Abbayi: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నితిన్- భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. కమెడియన్ సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఏప్రిల్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ? అనే సినిమాతో ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో రాబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ తో ప్రదీప్ కొత్త సినిమా అన్నప్పుడే ఈ సినిమాపై ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది.

 

ఇక ఈ సినిమా కోసం ప్రదీప్ చాలా కష్టపడుతున్నాడు.  నిజం చెప్పాలంటే.. జాక్ సినిమా కన్నా ప్రదీప్ సినిమానే సోషల్ మీడియాలో కొద్దిగా కనిపిస్తుంది.  ప్రదీప్.. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి అటు షోస్, ఇటు ఇంటర్వూస్ అంటూ ఏ ఒక్కరిని వదలకుండా వాడేస్తున్నాడు. ఎంత చేసినా  సినిమా మీద అంత బజ్ మాత్రం తీసుకురాలేకపోయాడు.

 

అయితే  తన సినిమా రిలీజ్ రెండు రోజులు ఉంది అనగా.. హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేత మొదటి టికెట్ ను కొనిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రదీప్, సత్య.. రామ్ చరణ్ ఇంటికి వెళ్లి తమ సినిమా మొదటి టికెట్ ను చరణ్ తో కొనిచ్చారు. ఈ వీడియోలో సత్య కామెడీ హైలైట్ గా నిలిచింది.

 

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చిత్రబృందానికి చరణ్ అల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రదీప్ మంచి హిట్ అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.  చరణ్  తో ప్రమోషన్స్ బాగానే ఉంది కానీ, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది అనేది కొందరి మాట. ఇదేదో ఒక వారం ముందు చేయించి ఉంటే.. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ వైరల్ చేసి కొంచెం హైప్ తీసుకొచ్చేవారు. సినిమా రిలీజ్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ రెండు రోజుల్లో ఈ వీడియో హైప్ తెస్తుందా.. ?  పెద్ది సాయం ప్రదీప్ కి ఉపయోగపడుతుందా అనేది చూడాలి.