Published On:

Arjun Son Of Vyjayanthi: ముచ్చటగా బంధాలే సాంగ్.. తల్లీకొడుకుల ప్రేమకు నిదర్శనం

Arjun Son Of Vyjayanthi: ముచ్చటగా బంధాలే సాంగ్.. తల్లీకొడుకుల ప్రేమకు నిదర్శనం

Arjun Son Of Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అర్జున్ సన్నాఫ్  వైజయంతీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత విజయశాంతి నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు భాతి అంచనాలనే పెట్టుకున్నారు.

 

ఇప్పటికే అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 18 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ఒక పక్క వరుస ఇంటర్వ్యూలు, షోస్ లలో కనిపిస్తూ సినిమాపై హైప్ పెంచేస్తుంటే.. ఇంకోపక్క మేకర్స్ సినిమాలోని లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి మరింత హైప్ ఇస్తున్నారు.

 

తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతీ చిత్రం నుంచి  ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ముచ్చటగా బంధాలే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తల్లీకొడుకుల మధ్య ఉన్న ప్రేమను ఈ సాంగ్ ద్వారా ఎంతో అద్భుతంగా చూపించారు.  అర్జున్ గా కళ్యాణ్ రామ్.. వైజయంతీగా విజయశాంతి కనిపించారు.

 

పోలీసాఫీసర్ అయిన వైజయంతీని కొడుకు అర్జున్ ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ప్రేమికుకురాలి కన్నా తల్లినే ఎక్కువగా ప్రేమించే క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడు. ఇక తల్లీకొడుకుల మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని అంతే అద్భుతంగా లిరిక్స్ లో నింపేశాడు లిరిసిస్ట్ రఘురామ్. కాంతార లాంటి హిట్ సినిమాకు మ్యూజిక్ అందించిన బి. అజనీష్ లోక్‌నాథ్  ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించాడు.

 

ఇక బి. అజనీష్ లోక్‌నాథ్  మ్యూజిక్ ఒక ఎత్తు అయితే హరి చరణ్ వాయిస్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. టోటల్ గా ఈ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఇక సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 18 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.