Amazon: భారత ఉద్యోగులకు అమెజాన్ షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని మెయిల్స్
ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియను చేపట్టాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ కూడా భారత్ లో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెల 30వ తేదీలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొంత మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపింది.
Amazon: ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియను చేపట్టాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ కూడా భారత్ లో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెల 30వ తేదీలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొంత మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. తద్వారా కంపెనీ అందించే బెనిఫిట్స్ తో అమెజాన్ ను విడిచి వెళ్లిపోవాలని కోరింది.
అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారం దాదాపు పది వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. భవిష్యత్తులో మరింత మందికి ఉధ్వాసన పలికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలో పని చేస్తున్న అనేక మంది భారతీయ ఉద్యోగులు వీఎస్పీ కోసం ప్లాన్ చేస్తున్నారు. కంపెనీ వారి ఒప్పందాన్ని ముగించే బదులు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా అమెజాన్ కూడా కోరుతోంది. వీఎస్పీ కోరే ఉద్యోగులు ఈనెల 30వ తేదీ లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోపు తమ సమ్మతి తెలిపే ఉద్యోగులు కంపెనీ అందించే ఇతర ప్రయోజనాలు పొందేందుకు కూడా అర్హులు అవుతారని అమెజాన్ వెల్లడించింది.
ఇదీ చదవండి అమెరికాలో భారతీయ టెకీలకు కష్టకాలం..