Last Updated:

Indian techies: అమెరికాలో భారతీయ టెకీలకు కష్టకాలం..

అమెరికాలో భారతీయ టెక్కీలకు గడ్డు కాలం ఎదురుకాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హెచ్‌ 1బీ వీసాపై అమెరికాకు వెళ్లిన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగులను కొన్ని కంపెనీలు అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించాయి.

Indian techies: అమెరికాలో భారతీయ టెకీలకు కష్టకాలం..

Washington: అమెరికాలో భారతీయ టెకీలకు గడ్డు కాలం ఎదురుకాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హెచ్‌ 1బీ వీసాపై అమెరికాకు వెళ్లిన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగులను కొన్ని కంపెనీలు అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఉదాహరణకు అమెజాన్‌, లిఫ్ట్‌, మేటా, సేల్స్‌ ఫోర్స్‌, స్ర్టయిప్‌, ట్విట్టర్‌ లాంటి కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. గత మూడు సంవత్సరాల నుంచి ఈ కంపెనీలు 45వేల మందిని హెచ్‌ 1బీ వీసా స్పాన్సర్‌ ద్వారా అమెరికాకు రప్పించుకున్నాయి. ఇటీవల కాలంలో టెక్నాలజీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను లే ఆఫ్‌ చేశాయి. తాజాగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మేటా, ట్విట్టర్‌ రెండు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను ఉద్యోగాల్లోంచి తీసేశాయి. దీని వల్ల ఇతర దేశాల నుంచి వలస వచ్చిన 350 మందిపై తీవ్ర ప్రభావం పడనుంది. కంపెనీలు ఉద్యోగాల్లోంచి పీకేసిన తర్వాత హెచ్‌ 1బీ వీసా హోల్డర్లు నిరుద్యోగులు అవుతారు. చట్ట ప్రకారం వీరంతా 60 రోజుల్లో కొత్త స్పాన్సర్‌ను పట్టుకొని కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. లేదంటే అమెరికాలో వీరు అక్రమంగా నివసిస్తున్నట్లు లెక్క.

అమెరికాలో హెచ్‌ 1బీ వీసాపై గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్న వారు లక్షలాది మంది ఉన్నారు. వీరంతా పర్మినెంట్‌ సిటిజన్‌ షిప్‌ కోసం దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హెచ్‌ 1బీ వీసా పై ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోయిన వారిలో టెన్షన్‌ మొదలైంది. మళ్లీ కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణ మొదలుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమెరికా లేబర్‌ మార్కెట్లో పోటీ ఎక్కువ. ఇప్పటికే ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వేలాది మందితో పాటు వీరు పోటీపడాల్సి వస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న వీరు స్థిరనివాసం ఏర్పరచుకున్నందు వల్ల ఇంటి కోసం రుణాలలకు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. కొంత మంది విద్యార్థులు స్టూడెంట్‌ లోన్‌ తీసుకొని ఉంటారు. మరి కొందరు పిల్లలు స్కూళ్లలో చదువుతుంటారు. అకస్మాత్తుగా దేశం వీడి వెళ్లాలంటే వీరికి ఇబ్బందే.

ఇవన్నీ ఒక ఎత్తయితే అతి పెద్ద కంపెనీలు రిక్రూట్‌మెంట్లు తాత్కాలికంగా నిలిపివేశాయి. ఏడాది ముగుస్తున్నందు వల్ల సెలవుల సీజన్‌ మొదలువుతుంది. అమెరికాలో సెలవుల సీజన్‌లో రిక్రూట్‌మెంట్ల జోరు అంతగా ఉండదు. 60 రోజుల గడువు సమీపిస్తున్న కొద్ది హెచ్‌ 1 బీ వీసా అభ్యర్థులు ఎలాగైనా ఉద్యోగం దక్కించుకొని దేశం వీడిపోరాదనుకుంటారు. కొంత మంది నేరుగా లింక్‌డిన్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో పాటు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో జాబ్‌ ఓపెనింగ్స్‌ పై ఫోకస్‌ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి: