Last Updated:

Satish Laxmanrao Jarkiholi: “హిందూ” అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉంది.. కాంగ్రెస్ నేత సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి

హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉందని, దాని మూలం భారతదేశంలో లేదని కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత సతీష్ లక్ష్మణ్‌రావ్ జార్కిహోళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

Satish Laxmanrao Jarkiholi: “హిందూ” అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉంది.. కాంగ్రెస్ నేత సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి

New Delhi: హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉందని, దాని మూలం భారతదేశంలో లేదని కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత సతీష్ లక్ష్మణ్‌రావ్ జార్కిహోళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇది పర్షియన్ నుండి వచ్చినదని అన్నారు. భారత్‌తో సంబంధం లేని పదాన్ని ప్రజలు ఎలా అంగీకరిస్తారని జార్కిహోలీ ప్రశ్నించారు.

హిందూ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? అది మనదేనా? ఇది పర్షియన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ప్రాంతానికి చెందినది. హిందూ అనే పదానికి భారత్‌తో సంబంధం ఏమిటి అలాంటప్పుడు మీరు దానిని ఎలా అంగీకరిస్తారు? ఇది చర్చించాలి,” అని ఆయన అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది, ఇది హిందువులను అవమానించడం మరియు రెచ్చగొట్టడం అని బీజేపీ విమర్శించింది. అనవసర వివాదాలు సృష్టించవద్దని సీనియర్‌ నేత ఒకరు కాంగ్రెస్‌ను కోరారు. ప్రజల మనోభావాలు మరియు సంస్కృతిని కాంగ్రెస్ గౌరవించాలని, గందరగోళం సృష్టించవద్దని కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్దనారాయణ్ అన్నారు.

కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను ఖండించింది. ఇది చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. హిందూ మతం ఒక జీవన విధానం. నాగరిక వాస్తవికత. ప్రతి మతాన్ని, విశ్వాసాన్ని గౌరవించేలా కాంగ్రెస్ మన దేశాన్ని నిర్మించింది. ఇది భారతదేశ సారాంశం అంటూ ఆయన ట్వీట్ చేసారు.

 

ఇవి కూడా చదవండి: