Home / Controversy
ఒక లగ్జరీ బ్యాగ్ దక్షిణ కొరియా అధికార పార్టీని షేక్ చేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీ ఖరీదైన బ్యాగ్‌ను బహుమతిగా పొందారంటూ వైరల్ అయిన దృశ్యాలు ఈ పరిస్థితి కారణమయ్యాయి.
బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ వచ్చే నెలలో G20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని సందర్శించే ముందు, బ్రెక్సిట్ అనంతర వాణిజ్య ఒప్పందం నుండి అతని కుటుంబం ఆర్థికంగా ప్రయోజనం పొందుతుందనే ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సమర్పించిన తీర్మానంపై ఐదుగురు రాజ్యసభ ఎంపీలు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని సోమవారం ఆరోపించడంతో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాదంలో చిక్కుకున్నారు. 'ఫోర్జరీ' ఘటనలో దోషిగా తేలితే రాఘవ్ చద్దాపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని రాజ్యసభ ఛైర్మన్ సిఫారసు చేయవచ్చని తెలిసింది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ జన్మదిన వేడుకల కోసం సిద్ధం చేసిన కేక్ ఆలయం నమూనాలో ఉండటం, దానిపై హనుమంతుడి చిత్రం ఉండటంపై వివాదం చెలరేగింది.
హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉందని, దాని మూలం భారతదేశంలో లేదని కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత సతీష్ లక్ష్మణ్‌రావ్ జార్కిహోళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
శివసేన పార్టీ గుర్తు వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. విల్లు-బాణం గుర్తును తమ వర్గానికే కేటాయించాలంటూ అటు ఉద్ధవ్ ఠాక్రే, ఇటు సీఎం ఏక్నాథ్ షిండే వర్గీయులు పోరాడుతున్నారు.
శుభాన్ని కల్గించే పాలపిట్టను దసరా రోజున చూడాలంటారు. ఇది తెలంగాణలో బలమైన ఆత్మీయ సెంటిమెంట్. దీని కోసం నేరుగా చూడని వారు సైతం ఫోటోలను షేర్ చేస్తూ పాలపిట్ట వల్ల కలిగే శుభాన్ని ఆశిస్తూ ఉంటారు. సెంటిమెంట్ తో కూడిన ఆ పాలపిట్ట వ్యవహారం ఓకరికి తంట తెచ్చి పెట్టింది. దీంతో ఆ ముఖ్య నేత వివాదంలో చిక్కుకొని గిలగిల లాడుతున్నారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ లక్ష్మిషా ఆకస్మిక బదిలీ వివాదంగా మారుతోంది. కొంత మంది వైసీపీ పెద్దలు కావాలనే కమిషనర్‌ను బదిలీ చేయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తాను తన శాఖలో 'దొంగలకు సర్దార్' నంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీహార్ స్టేట్ సీడ్ కార్పొరేషన్ రైతులను ఆదుకుంటామనే పేరుతో దాదాపు రూ.200 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన పోస్ట్ సంచలనం సృష్టించింది. వీడియోలో కనిపిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా రాజకీయ నాయకులు మరియు సోషల్ మీడియా వినియోగదారుల విమర్శలకు గురయ్యారు.