Last Updated:

Swathimutyam Review : స్వాతిముత్యం సినిమా రివ్యూ .. బెల్లంకొండ వారి చిన్నబ్బాయి హిట్ కొట్టేసినట్టే !

Swathimutyam Review : స్వాతిముత్యం సినిమా రివ్యూ .. బెల్లంకొండ వారి చిన్నబ్బాయి హిట్ కొట్టేసినట్టే !

Cast & Crew

  • బెల్లం కొండ గణేష్ (Hero)
  • వ‌ర్ష బొల్ల‌మ్మ‌ (Heroine)
  • వెన్నెల కిషోర్, రావు రమేష్, ప్రగతి (Cast)
  • లక్ష్మణ్ కె కృష్ణ (Director)
  • సూర్య దేవర నాగ వంశీ (Producer)
  • మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ (Music)
  • సూర్య (Cinematography)
3

Swathimutyam Review : నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇద్ద‌రి కొడుకుల్లో పెద్ద కొడుకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా ప‌రిచ‌యం అయ్యారన్న విషయం మనకి తెలిసిందే.సాయి శ్రీనివాస్ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా మాస్, యాక్ష‌న్ సినిమాలు చేస్తున్నారు.రెండో కొడుకు బెల్లంకొండ గ‌ణ‌ేష్ కూడా అన్న స్టైల్లోనే ఫాలో అవుతార‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ, గ‌ణేష్ డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమానే ‘స్వాతిముత్యం’.ఈ కాన్సెప్ట్‌తో సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా చేశామ‌ని చిత్ర యూనిట్ చెప్ప‌టంతోపాటు టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు.మరి ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది.. ప్రేక్షకులను ఆక‌ట్టుకుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాలిసిందే.

క‌థ‌:
కాకినాడ‌లోని పిఠాపురంలో ఉండే బాలు (బెల్లంకొండ గ‌ణేష్‌) ఎల‌క్ట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో జూనియ‌ర్ ఇంజ‌నీర్‌గా ప‌ని చేస్తుంటాడు. ఎవరి గురించి పట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోయే మ‌న‌స్త‌త్వం బాలుది.అదే సమయంలో బాలుకు ఇంట్లో పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తుంటారు.అలా ఓసారి పెళ్లి చూపుల్లో భాగ్య‌ల‌క్ష్మి (వ‌ర్ష బొల్ల‌మ్మ‌)ని గణేష్ చూసిన ఆమె ఒక్కసారి చూడగానే ఇష్టపడుతుంది.భాగ్య‌ల‌క్ష్మి ఇంజ‌నీరింగ్ చ‌దువుకుని..జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఎట్టకేలకు బెంగుళూరులో జాబ్ వ‌స్తుంది.కానీ ఇంట్లోవాళ్లు భాగ్య‌ల‌క్ష్మి ఆ ఉద్యోగానికి పంప‌రు.దాంతో అదే ఊరిలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌ని చేస్తు ఉంటుంది.ఆమెకు పెళ్లి త‌ర్వాత కూడా ఉద్యోగం చేయాలనుకుంటుంది.కానీ బాలు వాళ్ళ కుటుంబానికి అది నచ్చదు. దాంతో ఆమె బాలుని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకుటుంది.భాగ్య‌ల‌క్ష్మిని చూడ‌గానే ఇష్ట‌ప‌డ్డ బాలు..పెళ్లికి అంద‌రినీ ఒప్పిస్తాడు.పెళ్లి రోజు రానే వ‌స్తుంది..ఐతే అదే సమయంలో పెద్ద ట్విస్ట్ ఉంటుంది.. అది ఏంటంటే..బాలుకు శైల‌జ అనే అమ్మాయి ఫోన్ చేసి లేని పోనివి అన్ని చెబుతుంది.ఆమె ఓ చిన్న పిల్లాడిని తీసుకొచ్చి నువ్వే తండ్రివి అంటూ బాలు చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.దానితో బాలు పెళ్లి ఆగిపోతుంది.అస‌లు ఏ తప్పు చేయ‌ని బాలు అనుకోకుండా ఆ పిల్లాడికి తండ్రి ఎలా అయ్యాడు? అస‌లు శైల‌జ‌ బాలు జీవితంలోకి ఎలా వచ్చింది ? చివ‌ర‌కు బాలు తను ఏ తప్పు లేద‌ని ఎలా నిరూపించుకున్నాడు..భాగ్య‌ల‌క్ష్మిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే థియోటర్ కు వెళ్ళి సినిమా చూడాల్సిందే.

సినిమా ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్ ఇరు రెండు కుటుంబాలు.భాగ్య‌ల‌క్ష్మి పెళ్లికి ఒప్పుకోక‌పోతే బాలు అమెను ఒప్పించే స‌న్నివేశాలు.అలాగా సాగుతూ మధ్యలో పాటలతో అలా సాగుతుంది.ఫ‌స్టాఫ్ చూడటానికి గొప్ప‌గా లేక‌పోయినా అలా అని బోరింగ్‌గా కూడా లేదు…చిన్న ట్విస్ట్‌తో ఇంట‌ర్వెల్ వచ్చేస్తుంది.ఇక సెకండాఫ్‌లోకి వెళ్తే పాత్ర‌లు, స‌న్నివేశాలు, మధ్య మధ్యలో వచ్చే కామెడీ చూసే ప్రేక్ష‌కులాను అలరిస్తాయి. ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ ఎక్క‌డా కూడా సీరియ‌స్‌ లేకుండా మరి ఓవ‌ర్ ఎమోష‌న‌ల్‌గా చెప్పే ప్ర‌య‌త్నం చెయ్యలేదు.అలాగే సినిమా రెండు గంట‌లు మాత్ర‌మే ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం చాలా మంచిదైంది.ఫస్టాఫ్ ముగుస్తున్న సమయంలో ట్విస్ట్ ఇస్తూ బాలుని ఇబ్బంది పెట్టిన శైలజ దుబాయ్ వెళ్లిపోతున్నట్టు చూపించారు. కానీ సెకండాఫ్‌లో మళ్ళీ ఆమె కనిపిస్తుంది.సెకండాఫ్‌ చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ చూసే వాళ్ళకి అర్దం కావు.. ఎందుకు బాలు నేనేమీ తప్పు చెయ్యలేదని బలంగా చెప్పడం లేకపోతున్నాడనే ప్రశ్న మనకి వస్తుంది.ఈ సినిమాకు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది.సూర్య సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా బావుంది.

చివరగా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే  Fun Filled Entertainer 

ఇవి కూడా చదవండి: