Kanguva Review: ‘కంగువా’ మూవీ రివ్యూ – సూర్య సినిమా ఎలా ఉందంటే!
Kanguva Movie Review in Telugu: తమిళ స్టార్ హీరో సూర్య మూవీ అంటే ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన ఎంచుకునే కథ, పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. అందుకే సూర్య సినిమాలకు కోలీవుడ్‌లోనే కాదు తెలుగులోనూ మంచి బజ్ ఉంది. దీంతో ఆయన నుంచి సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి ఈసారి సూర్య ‘కంగువా ‘అంటూ ఓ పిరియాడికల్ యాక్షన్ డ్రామాతో రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ చిత్రం. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్లోకి వచ్చింది. రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూశారు. 1050 కాలం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సూర్య కంగువా అనే పోరాట యోధుడి పాత్ర పోషించాడు. మొదటి నుంచి ఎంతో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రచార పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. రిలీజ్‌కు ముందు విడుదలైన రెండు ట్రైలర్ సినిమాకు ఆకాశానికి ఎత్తాయి. రిలీజ్‌కు ముందు ఎంతో బజ్ క్రియేట్ చేసిన కంగువ ప్రేక్షకులను మెప్పించిందా? సూర్య ఖాతాలో హిట్ పడిందా? చూద్దాం!
కథ:
ఓ చిన్న పిల్లాడు ల్యాబ్ నుంచి తప్పించుకోవడంతో సినిమా మొదలవుతుంది. 2024లో ఓ ల్యాబ్‌లో మనుషులపై ప్రయోగాలు చేస్తుంటారు. అప్పుడే ఆ ల్యాబ్ నుంచి జీటా అనే కోడ్ నేమ్‌తో ఉన్న పిల్లాడు తప్పించుకుని గోవాకి వస్తాడు. అక్కడే అతడు ఫ్రాన్సిస్(సూర్య)ను కలుసుకుంటాడు. గోవాలో ఫ్రాన్సిస్, కోల్ట్(మోగిబాబు) బౌంటీ హంటర్స్ (క్రిమినల్స్‌ని పట్టుకోవడం)గా ఉంటారు. పోలీసులకు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ని పట్టుకుంటూ డబ్బు తీసుకుంటారు. అయితే దిశా పటానీతో ప్రాన్సిస్ ప్రేమలో పడతాడు. ప్రజెంట్ వారికి బ్రేకప్ అవ్వడంతో ఈ ప్రేమికులు కాస్తా బద్దశత్రువుల అవుతారు. అలా సాగుతున్న కథలో జిటా ప్రాన్సిస్‌కి ఎదురుపడతాడు. వీరిద్దరు ఒకరినోకరు చూసుకుని ఏదో కనెక్షన్‌గా ఫీల్ అవుతారు. అప్పుడే గతంలోని కోన్ని సంఘటనలు కళ్లముందు కనిపిస్తాయి. అప్పుడే జిటాను వెతుక్కుంటూ ల్యాబ్ మనుషులు గోవా చేరుకుంటారు. అక్కడ జిటాను చూసి వెనక్కి తీసుకువెళ్తుండగా.. ప్రాన్సిస్ వారితో పోరాడుతాడు. వారితో ఫైట్ చేస్తుండగా.. స్టోరీ క్రీస్తూ పూర్వంకు వెళుతుంది. 1070లో నాటి సన్నివేశాలు చూపిస్తారు. అప్పుడే ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. అసలు ఈ జిటా ఎవరూ? ప్రాన్సిస్‌కి అతడి మధ్య సంబంధం ఏంటి? దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నివసించిన ఆదివాసి నాయకుడుకి వీరికి సంబంధం ఏంటి? అనేది క్యూరియాసిటీని పెంచుతుంది. మరి వీటికి సమాధానాలు దొరకలాంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వెళ్లిన ఆడియన్స్ సినిమా మొదలు కాగానే ఎంతో క్యూరియాసిటీతో ఉంటారు. మొదట్లోనే సినిమాలో ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయా? ఈ పీరియాడిక్ యాక్షన్ ఎలా మొదలైందని తెలుసుకునేందుకు ఓ అంచనాతో ఉంటారు. అలాంటి వారిని ఫస్టాఫ్ కాస్తా డిసప్పాయింట్ చేస్తుంది. అసలు కథ మొదలవ్వడానికి డైరెక్టర్ దాదాపు 40 నిమిషాల టైం తీసుకున్నాడు. దీంతో సినిమా చాలా లాగ్ అనిపిస్తుంది. సైడ్ క్యారెక్టర్స్‌తో కాసేపు అలా ఎంటర్‌టైన్ చెద్దామనుకున్న డైరెక్టర్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే మొదటి 40 నిమిషాలకు వరకు స్క్రిన్‌పై కనిపించే పాత్రలన్ని బోర్ కొట్టిస్తాయి. ప్రేక్షకులంతా కంగువా ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంటే.. ప్రస్తుత పాత్రలతో ఎంగేజ్ చేశాడు. ఇది ఆడియన్స్ విసుగు తెప్పిస్తుంచేందని చెప్పోచ్చు. దిశ పటానీ పాత్రను గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసిన అది పెద్దగా పండలేదనే చెప్పాలి. సీరియస్ సన్నివేశాల్లో కూడా కామెడీ చేసే అంశం చిరాకు తెప్పించింది. అదే టైంలో డైరెక్టర్ శివ రెగ్యూలర్ సినిమాలా ఉందే అని అభిప్రాయపడుతున్న టైంలో ఒక్కసారిగా అసలు కథను స్క్రీన్‌పై తీసుకురావడంతో సినిమా ఆసక్తి పెంచుతుంది.
ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో ఐదు రకాల తెగల ప్రజలను పరిచయం చేస్తారు. అప్పుడే కంగువ(సూర్య) పాత్రను రివీల్ అవుతుంది. రొమేనియన్ సామ్రాజ్యం ఈ ఐదు తెగల ప్రజలను విడగోట్టి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. అది తెలిసిన కంగువ ఇచ్చిన మాట కోసం ఏం చేస్తాడు. రొమియన్ సైన్యంతో ఎటువంటి యుద్దాలు చేశాడు, అసలు కంగువ, ప్రాన్సిస్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. అసలైన ఎమోషన్స్, వార్ ఎపిసోడ్ సెకండాఫ్‌లోనే ఉన్నాయి. చెప్పాలంటూ సెకండాఫ్‌లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. మంచు కొండల్లో వచ్చే ఒక యాక్షన్ సీన్, అడవిలో సూర్యకి ఆర్మీ వార్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ మంచి హైప్ ఇస్తుంది. రొమియన్ సైన్యం నాయకుడి బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపించాడు.
అతడి క్యారెక్టర్ పవర్ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేసిన అది అంతగా వర్క్ అవుట్ కాలేదని చెప్పోచ్చు. చివరికి ఓ ఎమోషన్ టచ్‌తో మూవీ క్లైమాక్స్ ఉంటుంది. అప్పుడే వచ్చే రెండు ట్విస్ట్‌లు రెండో పార్ట్‌పై ఆసక్తిని పెంచుతుంది. అందులో సూర్య తమ్ముడు, హీరో కార్తీ ఎంట్రీ ఒకటి. కార్తీ ఎంట్రీతోనే సెకండ్ పార్ట్‌కి లీడ్ ఉంటుందని హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. ఇక సినిమా మొత్తానికి ఆడవాళ్లు చేసే ఫైట్ అనే చెప్పాలి. మూవీ లో ఎమోషన్స్ ఓకే కానీ కనెక్టివిటీ మిస్ అయ్యింది. దేవివ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ బీజీఎం మూవీకి ప్లస్ అయ్యింది. ఓవరాల్‌గా ‘కంగువ’ ప్రొడక్రిన్ వాల్యూస్ బాగానే ఉన్న స్క్రీన్‌ప్లే కాస్తా వీక్ అని చెప్పోచ్చు. .కథకి కనెక్ట్ అయ్యేలా నడిపించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. ఫస్టాఫ్ సినిమాపై ఆసక్తిని పొగోడుతుంది. ఈ విషయంలో డైరెక్టర్ కేర్ తీసుకుని ఉంటే కంగువ అద్భుతమైన సినిమా అయ్యేది. ఇది ఓ కొత్త సినిమా అని చెప్పారు. కానీ ఫస్టాఫ్ రొటిన్‌గా సాగడంతో కథకు ఇదే మైనస్ అని చెప్పాలి. ఓవరాల్‌గా ఈ మూవీ వన్ టైం వాచ్ అని చెప్పోచ్చు.
ఎవరేలా చేశారంటే
సూర్య నటన ఈ సినిమా ప్లస్ అని చెప్పాలి. కంగువా, ప్రాన్సిస్ పాత్రల్లో ఒదిగిపోయి నటించాడు. ముఖ్యంగా వీరత్వం ఉన్న యోధుడి పాత్రకు సూర్య జీవం పోశాడని చెప్పాలి. రుధిర పాత్రలో బాబీ డియోల్ పర్ఫామెన్స్ మెప్పిస్తుంది. కానీ ఈ పాత్ర డైరెక్టర్ పూర్తి ప్రాధాన్యం ఇవ్వడంలో తడబడ్డాడనే చెప్పాలి.