Salman Khan : ఫ్యాన్స్ ని రిక్వస్ట్ చేసిన సల్మాన్ ఖాన్ .. ఎంజాయ్ చేద్దాం కానీ జాగ్రత్తగా వుందాం ..
salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో “టైగర్ 3” లో నటించారు . అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో “టైగర్ 3” లో నటించారు . అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక పోతే యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ గా చేస్తుండటం విశేషం. సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ 3 అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసిన చిత్రం . యశ్‌రాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దీపావళి కానుకగా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఆయా థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని మాలెగావ్ థియేటర్‌లో కొంతమంది అభిమానులు హంగామా సృష్టించారు. సల్మాన్ ఎంట్రీ సమయంలో థియేటర్‌లో పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. ఈ అనూహ్య చర్యతో భయాందోళనలకు గురైన ప్రేక్షకులు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. ఆకతాయిలు చేసిన పనిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులకు, థియేటర్ యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన సల్మాన్ ఖాన్ వరకు చేరగా ఆయన ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘టైగర్ 3’ స్క్రీనింగ్‌లో టపాసులు కాల్చారనే వార్తలు విన్నా. ఇలాంటి ఘటనలకు పాల్పడటం ప్రమాదకరం. మనతోపాటు ఇతరులను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి పనులు చేయకుండా సినిమాని ఎంజాయ్ చేద్దాం. జాగ్రత్తగా ఉండండి’’ అని సల్మాన్ ట్వీట్ చేశారు.
Is That Even A Question Baap Tho Baap Hee Hotha Hey😂
PATHAAN KA BAAP TIGER 🔥#SalmanKhan #Tiger3pic.twitter.com/yhvFeVWGlP
— 101™ REPORTS (@viratkohali1231) November 13, 2023