TG Assembly: అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కీలక కామెంట్స్.. ఎస్సీ రిజర్వేషన్ల పెంపు అప్పుడే!

Minister Uttam Kumar Reddy Key Comments In Assembly: ఎస్సీ రిజర్వేషన్ల పెంపుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఐదో రోజు ఎస్సీ వర్గీవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి బదులు మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతానికి పరిమితం చేయడంపై ఎదురవుతున్న ప్రశ్నల సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతంగా ఖరారు చేశామన్నారు. 2026లో జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఎస్సీ జనాభా ఎంత ఉంటే అందుకు తగిన విధంగా రిజర్వేషన్లు పెంచుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు.