Published On:

ISO Certificate: సివిల్ సప్లై శాఖకు అరుదైన ఘనత.. ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం

ISO Certificate: సివిల్ సప్లై శాఖకు అరుదైన ఘనత.. ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం

Civil Supply: తెలంగాణ పౌరసరఫరాల శాఖకు అరుదైన ఘనత దక్కింది. రాష్ట్రంలో సివిల్ సప్లై సంస్థ చేపట్టిన సంస్కరణలపై అధ్యయనం చేసిన హెచ్ఎంవై.. సన్నబియ్యం పంపిణీ, మెరుగైన సేవలకుగాను ఫైవ్ స్టార్ రేటింగ్ తో 9001 ఐఎస్ఓ సర్టిఫికెట్ ను అందించింది. ఈ సర్టిఫికెట్ ను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ అందుకున్నారు.

కాగా పౌరసరఫరాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారుకి దక్కుంతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పథకం అమలును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. తమ శాఖ చేసిన సేవలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తామని వివరించారు.