Last Updated:

Pakistan : పాక్‌లో సైనికుల కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు మృతి

Pakistan : పాక్‌లో సైనికుల కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు మృతి

Pakistan : పాక్‌లో సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ వాహనంపై బాంబు దాడి జరిగింది. ఆదివారం బలూచిస్థాన్‌లోని నోష్కిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో 5 మంది సైనికులు మృతిచెందగా, 12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు అధికారులు విచారణ జరపగా, దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించారు. ఈ విషయాన్ని నోష్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు. మరోవైపు, ఈ పేలుడులో 90 మంది సైనికులను చంపినట్లు బలోచ్‌ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రముఖ మీడియా సంస్థకు మెయిల్‌ పంపింది. ‘బలోచ్‌ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఫిదాయీ యూనిట్‌ ‘మజీద్‌ బ్రిగేడ్‌’ కొన్ని గంటల కింద నోష్కి సమీపంలోని పాకిస్థాన్ మిలిటరీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుంది. దానిలో ఎనిమిది బస్సులు ఉన్నాయి. పేలుడు వల్ల ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

 

 

పేలుడు సంభవించిన తర్వాత బీఎల్‌ఏకు చెందిన ఫతే స్క్వాడ్‌ వెంటనే మరో బస్సును చుట్టుముట్టింది. దానిలో ఉన్న సైనికులను హతమార్చింది. మా విరోధుల మరణాల సంఖ్య 90కి చేరిందని పేర్కొంది. కాగా, ఇటీవల పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌లో ప్రయాణికుల రైలును వేర్పాటువాద ఈ మిలిటెంట్లు హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న రైలుపై దాడికి పాల్పపడ్డారు. ప్రయాణికులను బందీలుగా మార్చి పలువురి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన అతి కొద్ది రోజుల్లో మరో దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడులో 5మంది సైనికులు మృతి చెందినట్లు లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు.

ఇవి కూడా చదవండి: