Bhadrakaali Teaser: భద్రకాళీగా వస్తున్న పరాశక్తి.. టీజర్ అదిరిపోయింది

Bhadrakaali Teaser: బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి సుపరిచితుడుగా మారాడు తమిళ్ నటుడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు 2 తో కూడా మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం భద్రకాళీ. అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే టైటిల్ వివాదంలో ఇరుక్కుంది. మొదట ఈ సినిమాకు పరాశక్తి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆ ఇక ఇదే టైటిల్ తో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ – సుధా కొంగర కాంబోలో వస్తున్న చిత్రానికి కూడా పరాశక్తి అనే టైటిల్ నే ఖరారు చేశారు. గంటల వ్యవధిలోనే ఈ రెండు పోస్టర్లను రిలీజ్ చేయడం సెన్సేషన్ గా మారింది.
ఇక ఒకరి తరువాత ఒకరు తాము రిజిస్టర్ చేయించుకున్న డేట్స్ ను పోస్ట్ చేస్తూ వార్ కు సిద్ధమయ్యారు. ఎట్టకేలకు విజయ్ ఆంటోనీ తగ్గి.. పరాశక్తి టైటిల్ ను శివకార్తికేయన్ కు ఇచ్చేసి.. తన సినిమాకు భద్రకాళీ అని టైటిల్ పెట్టుకొచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా భద్రకాళీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
భద్రకాళీ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” దారి చూపడానికి వచ్చిన స్వామి.. విత్తనమై మొలకెత్తాడు” అంటూ వచ్చే డైలాగ్ తో టీజర్ ప్రారంభమయ్యింది. కిట్టు అనే ఒక వ్యక్తి కథనే ఈ సినిమా అని తెలుస్తోంది. అతను ఒక గ్యాంగ్ స్టర్, పెదాలను కాపాడే దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ చేసి దొరికిపోయిన అతను.. అంతా జైల్లో ఉండే నడిపించినట్లు కొందరు చెప్పుకొచ్చారు. అసలు కిట్టు ఎవరు.. ? చిన్నతనంలో అతను ఏమవ్వాలనుకున్నాడు.. ? ఆ స్కామ్ ఎందుకు చేశాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. రాజకీయాల్లో ఒక స్కామ్ బయటపడితే అది ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటింది ఏకంగా రూ. 197 కోట్లు ఒక సాధారణ వ్యక్తి ఎలా సంపాదించాడు అనేది ఎంతో కమర్షియల్ గా చూపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ ను కూడా విజయ్ ఆంటోనీనే అందించాడు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.