Last Updated:

Suriya: ఆ ఐదు రోజులు జైల్లో ఉన్నట్లే అనిపించింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన సూర్య

Suriya: ఆ ఐదు రోజులు జైల్లో ఉన్నట్లే అనిపించింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన సూర్య

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1 న రిలీజ్ కానుంది. గతేడాది కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్యకు పరాజయమే మిగిలింది. అందుకే ఈసారి రెట్రో సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రెట్రో మూవీ మే 1 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఇటీవల ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. కన్నుల్లోనా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. జైల్లో ఉన్న హీరో.. హీరోయిన్ ను తలుచుకొని పాడే సాంగ్ అని వీడియో ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ షూటింగ్ గురించి సూర్య ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఐదురోజులు ఈ సాంగ్ షూటింగ్ జరిగిందని.. నిజంగా జైల్లోనే ఉన్నట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు.

Ameesha Patel: చిన్న చిన్న బట్టలు ఆ హీరో వేసుకోనిచ్చేవాడు కాదు.. అతని ఇంటికి వెళితే..

” చెన్నైలో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జైలు సెట్ వేశారు. ఆ సెట్ ఎలా ఉందంటే నిజంగా జైలు ఉన్నట్లే  అనిపించింది. కిచెన్, లైబ్రరీ మొత్తాన్ని ఆర్ట్ బృందం ఎంతో అద్భుతంగా చేశారు. ఒక సాంగ్ కోసం అక్కడే ఐదురోజులు షూటింగ్ జరిగింది. ఆ ఐదు రోజులు నాకు నిజంగా జైల్లో ఉన్నట్లే అనిపించింది. ఆ సాంగ్ లో నా డ్యాన్స్ కూడా ఎంతో బాగా వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

రెట్రో మీదనే ఒకపక్క సూర్య.. ఇంకోపక్క పూజా హెగ్డే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లు గ్యాప్ తరువాత పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం. ప్లాపుల మధ్యలో సాగుతున్న ఆమె కెరీర్.. రెట్రో హిట్ మీదనే ఆధారపడి ఉంది. ఇక సూర్య సైతం ఈ సినిమా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.  కార్తీక్ సుబ్బరాజ్  డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిజ్జా సినిమా మొదలుకొని.. మొన్నీమధ్య వచ్చిన జిగర్తాండ డబుల్ ఎక్స్ వరకు మంచి మంచి కథలతో హిట్స్ అందుకున్నాడు. మరి ఈ సినిమాతో సూర్యకు కార్తీక్ ఎలాంటి హిట్ ను అందిస్తాడో చూడాలి.