Last Updated:

Ameesha Patel: చిన్న చిన్న బట్టలు ఆ హీరో వేసుకోనిచ్చేవాడు కాదు.. అతని ఇంటికి వెళితే..

Ameesha Patel: చిన్న చిన్న బట్టలు ఆ హీరో వేసుకోనిచ్చేవాడు కాదు.. అతని ఇంటికి వెళితే..

Ameesha Patel: బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో బద్రి సినిమాతో అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చుకోవడంతో పాటు ఎంతోమంది కుర్రాళ్ళకు కలల రాణిగా మారింది. బద్రి తరువాత పలు సినిమాల్లో నటించినా అమీషాకు తెలుగులో అంతగా పేరు రాలేదు. దీంతో ఈ చిన్నది బాలీవుడ్ కే పరిమితమయ్యింది.

ఇక సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిన అమీషా.. ఇప్పటివరకు పెళ్లికోకుండా ఉండిపోయింది. చాలా గ్యాప్ తరువాత ఆమె గదర్ 2 తో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా అమీషాకు వరుస అవకాశాలను తీసుకొచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఈ మధ్యన అమీషా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన డైరెక్టర్ విక్రమ్ భట్ తో అమీషా ప్రేమవ్యవహారంనడుపుతుందని  రూమర్స్ వచ్చాయి. దీనిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమీషా.. తనకు నచ్చిన హీరో గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో అతను బంగారు హృదయం కలిగినవాడని కితాబు ఇచ్చింది. అతను ఎవరో కాదు సంజయ్ దత్. బాలీవుడ్ లో సంజయ్ – అమీషా జోడికి మంచి పేరు ఉంది. వీరిద్దరూ కలిసి  మూడు సినిమాలు చేశారు. ఇక సంజయ్ గురించి అమీషా మాట్లాడుతూ.. ” సంజయ్ కు పొట్టి బట్టలు ఇష్టం ఉండదు. నేనెప్పుడూ చిన్ని చిన్ని బట్టలు వేసుకున్నా అతనికి నచ్చేది కాదు.

Agent OTT: ఎట్టేకలకు అయ్యగారి సినిమాకు మోక్షం.. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

సంజయ్ వాళ్ళింటికి వెళ్ళాలి అంటే సల్వార్ కమీజ్ వేసుకొని వెళ్ళాలి. అతను నాపై అమితమైన ప్రేమను కురిపించేవాడు. నువ్వు చాలా అమాయకురాలివి.. ఇండస్ట్రీలో ఎలా ఉంటావో అంటూ చెప్పుకొచ్చేవాడు. నాకోసం ఒక మంచి అబ్బాయిని కూడా వెతికి పెళ్లి చేస్తానని చెప్పేవాడు. అంతేకాదు కన్యదానం కూడా తానే దగ్గరుండి చేస్తాను అని అంటుండేవాడు. సంజయ్ కు నేనంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు ఆయన ఇంట్లోనే నా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గ మారాయి.

ఇక ప్రస్తుతం అమీషా బాలీవుడ్ కే పరిమితమయ్యింది. అవకాశం వస్తే తెలుగులో కూడా నటించడానికి వెనుకాడను అని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు పాత హీరోయిన్లను వెలికితీసి రీఎంట్రీ ప్లాన్ చేస్తున్న మేకర్స్.. అమీషాను మరోసారి తెలుగుతెరకు పరిచయం చేస్తారేమో చూడాలి.