Udit Narayan: మహిళ అభిమానులతో ముద్దు వివాదం – స్పందించిన గాయకుడు ఉదిత్ నారాయణ్
Udit Narayan Reaction on Kiss Controversy: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ దశాబ్ధాలుగా తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను అలరిస్తున్న ఆయన తాజాగా ముద్దు వివాదంలో చిక్కున్నారు. రీసెంట్గా ఆయన ఇచ్చిన మ్యూజిక్ కన్సర్ట్స్‌లో అభిమానిని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వివాదంగా మారింది. ఆయన తీరు తప్పుబడుతూ నెటిజన్స్‌తో పాటు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆయన స్పందించారు.
అభిమానులపై ప్రేమతోనే తాను అలా చేశానని, ఇందులో తనకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదన్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయనకు ముద్దు వివాదంపై ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకతపై ఉదిత్ నారాయణ్ స్పందించారు. “ఇందులో నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు. అది ఆత్మీయతతో కూడుకున్న అంశం. అభిమానులకు నేనంటే ఇష్టం.
🚨Video of #UditNarayan Lip Kissing a Fan has gone viral.
The Internet is criticizing and calling it Disgusting. pic.twitter.com/5dIthwMnM3
— Let's Talk TV|Latest Updates (@letstalktv___) February 1, 2025
తమ ఇష్టాన్ని తెలియజేయడానికి కొందరు షేక్‌హ్యాండ్ ఇస్తారు, మరికొందరు హగ్ ఇస్తారు. అందులో భాగంగా కొందరు ముద్దు పెట్టుకోవాలనుకుంటారు. అది కేవలం ఆత్మీయతతో కూడుకున్న విషయమే. నేను ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిని. వారితో తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం అసలు లేదు. నేను మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటాను. కొందరు కావాలనే దీనికి వివాదంలో చూస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చారు. కాగా తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు ఎన్నో భాషల్లో ఆయన కొన్ని వేల పాటలు పాడారు. టాలీవుడ్లో ఆయన పాడిన అందమైన ప్రేమరాని, కీరవాణి రాగంలో, అమ్మాయే సన్నగా, పసిఫిక్‌లో దూకేమ్మంటే దూకేస్తానే వంటి పాటలు తెలుగు ఆడియన్స్‌ని బాగా ఆకట్టకున్నాయి.