Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో ఊహించని ట్విస్ట్ – అతడి వేలిముద్రలు ఎక్కడా..!
Fingerprint Did not Match With Accused Shariful Islam: సైఫ్ అలీఖాన్ కత్తి దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సైఫ్ ఇంట్లోని దాడి ప్రదేశం నుంచి పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ వేలి ముద్రలు నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని తేలింది. దీంతో ఈ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ఈ నెల జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ దుండగుడు చోరీకి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిందితుడు అడ్డుకున్న సైఫ్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉల్కిపడింది. ఇది హై ప్రైఫైల్ కేసు కావడంతో ముంబై పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నాడు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సైఫ్ ఇంటి నుంచి 19 సెట్ల వేలిముద్రల్ని సేకరించి వాటిని సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపారు.
అక్కడ వేలిముద్రలను పరిశీలించగా.. అవి షరీఫ్ వేలిముద్రలతో సరిపోవడం లేదని తేలిసింది. సంఘటన ప్రదేశంలోని ఫింగర్ ఫ్రింట్స్‌ని నిందితుడు వేలిముద్రలతో పోల్చగా.. సిస్టమ్ జనరేటేడ్ రిపోర్టులో నెగిటివ్‌గా వచ్చినట్టు సీబీఐ అధికారులు ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. తదుపరి పరీక్షల కోసం సైఫ్ ఇంటి నుంచి మరిన్ని వేలిముద్రల నమునాల్ని సేరించిన పోలీసులు మరసారి సీఐడీ విభాగానికి పంపినట్టు సమాచారం. కాగా ఈ కేసులో సైప్ పోలీసులకు తన వాగ్ములనం ఇచ్చిన సంగతి తెలిసిందే.
జనవరి 16న తెల్లవారు జామున ఉదయం 2:30 గంటలకు సైఫ్‌పై దాడి జరగగా.. 4 గంటలకు లీలావతి ఆస్పత్రికి వెళ్లాడు. దొంగతనం కోసం సైఫ్ ఇంట్లో ప్రవేశించిన దుండగుడు తన చిన్న కుమారుడు జేహ్ గదిలో దురినట్టు చెప్పాడు. అతడిని గుర్తించిన జేహ్ కేర్‌టేకర్ ఫలిప్ కేకలు వేయడంతో తన గది నుంచి బయటకు వచ్చానని, దీంతో దుండగుడి పట్టుకుని గదిలో బంధించాలనుకున్నానని చెప్పాడు. కానీ,వెంటనే అతడు తనపై కత్తితో దాడి చేశాడని, వీపుపై, మెడ భాగంతో చేతిపై కత్తితో దాడి చేసినట్టు తెలిపాడు. అయినా అతడిని పట్టుకునే బంధించేందుకు ట్రై చేశానన్నారు. కానీ అతడు తప్పించుకుని పారిపోయినట్టు సైఫ్ పోలీసులకు వాగ్ములనం ఇచ్చాడు.