Last Updated:

Mahindra XUV 3XO EV: మహీంద్రా ఖాతాలో మరో హిట్ పక్కా.. XUV 3XO ఈవీ వచ్చేస్తోంది.. ఎంట్రీ అదిరిపోతుంది..!

Mahindra XUV 3XO EV: మహీంద్రా ఖాతాలో మరో హిట్ పక్కా.. XUV 3XO ఈవీ వచ్చేస్తోంది.. ఎంట్రీ అదిరిపోతుంది..!

Mahindra XUV 3XO EV: మహీంద్రా తన కొత్త ఎస్‌యూవీ XUV 3XOను గత సంవత్సరం విడుదల చేసింది. దీనికి వినియోగదారుల నుంచి విపరీతమైన మద్దతు లభించింది. ఈ కారు పెట్రోల్, డిజిల్ ఇంజన్‌తో నడుస్తుంది. అయితే ఇప్పుడు భారతదశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ నిరంతరం పెరుగుతుంది. దీని దృష్ట్యా మహీంద్రా XUV 3XOపై వేగంగా పనిచేస్తుంది. ఇటీవలే ఈ కారు టెస్టింగ్‌లో కనిపించింది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. ఒడిశాలోని రూర్కెలా సమీపంలో టెస్ట్ చేశారు.

టాటా డీలర్‌షిప్ ముందు నుండి లీక్ అయిన XUV 3XO EV  స్పై షాట్‌లలో ఈ కారు డిజైన్ స్పష్టంగా చూడచ్చు. రౌండ్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, C-సైజు LED DRLతో అదే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఈ EV ముందు భాగంలో చూడవచ్చు. బ్లాక్ కలర్ రూఫ్ రెయిల్స్, ORVMలు, షార్క్ ఫిన్ యాంటెన్నా డిజైన్‌గా ఇచ్చారు. ఇది కాకుండా దీనిలో 360-డిగ్రీ కెమెరా కూడా ఉంది.

మహీంద్రా XUV 3XO EV ఒక ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ SUV, ఇది XUV 4OO కంటే చిన్నదిగా ఉంటుంది. భారతదేశంలో ఇది టాటా నెక్సాన్ EV,  పంచ్ EVలతో పోటీపడుతుంది. భారతదేశంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ధర రూ. 12 నుండి 15 లక్షల మధ్య ఉండవచ్చు. ఇది ఆటో ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టబడుతుందని నమ్ముతారు.

మహీంద్రా XUV 3XO దాని డిజైన్,  పనితీరు కారణంగా కస్టమర్ల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఈ SUV అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షల నుండి. ఇది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది.

ఇంజన్ గురించి మాట్లాడితే XUV 3XO 3 ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది, వీటిలో 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్ 82kW పవర్,  200 Nm టార్క్ ఇస్తుంది. ఇది కాకుండా, దాని రెండవ ఇంజన్ కూడా 1.2L టర్బో పెట్రోల్, ఇది 96 kW పవర్, 200 Nm టార్క్ ఇస్తుంది. దీని మూడవ 1.5L టర్బో డీజిల్ ఇంజన్ 86Kw పవర్, 300 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో  21.2 km/l వరకు మైలేజీని అందిస్తాయి.