Honda Shine 100: దమ్ముంటే పట్టుకో షెకావత్.. హోండా షైన్ 585 కిమీ మైలేజ్.. దీన్ని కొట్టేదే లేదు..!
Honda Shine 100: దేశంలో 125సీసీ సెగ్మెంట్లో హోండా షైన్ మాత్రమే ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇప్పటి వరకు ఏ ఇతర బైకులు కూడా సేల్స్‌లో దీన్ని బీట్ చేయలేకపోయాయి. షైన్ 125 నమ్మదగిన బైక్‌గా మారింది. ఈ పేరును సద్వినియోగం చేసుకొని హోండా షైన్ 100ని మార్కెట్లోకి దింపింది. ఈ బైక్ తక్కువ ధర, సాధారణ డిజైన్, అద్భుతమైన మైలేజీ కారణంగా బాగా అమ్ముడవుతోంది. రోజువారి ఉపయోగానికి ఇది మంచి బైక్. దీనిలో 9 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ట్యాంక్ నిండినప్పుడు, ఇది చాలా మంచి మైలేజ్ ఇస్తుంది.
Honda Shine 100 Mileage
హోండా షైన్ 100లో 98.98 cc 4 స్ట్రోక్, SI ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7.28 బిహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇంజిన్ మృదువైనది, మంచి మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ ఒక లీటర్‌లో 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో 9 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. అటువంటి పరిస్థితిలో, ట్యాంక్ నిండితే ఈ బైక్ మొత్తం 585 కి.మీ.
Honda Shine 100 Price, Specifications
హోండా షైన్ 100 ఎక్స్-షోరూమ్ ధర రూ.66,900 నుండి ప్రారంభమవుతుంది. షైన్ 100 డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. డిజైన్ పరంగా కుటుంబ వర్గాలకు ఈ బైక్ నచ్చవచ్చు. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో 99 కిలోల బరువున్న ఏకైక బైక్ ఇదే, స్ప్లెండర్ ప్లస్ 112 కిలోల బరువు ఉంటుంది. తక్కువ బరువు కారణంగా, అధిక ట్రాఫిక్‌లో కూడా షైన్‌ను ఈజీగా డ్రైవ్ చేయచ్చు. దీని మెయింటినెన్స్ కూడా సులభం. బ్రేకింగ్ కోసం, దీనిలో డ్రమ్ బ్రేక్ ఉంది. డిస్క్ బ్రేకులు వస్తే బాగుంటుంది.
ఈ బైక్ రోజువారీ వినియోగానికి మంచి ఎంపిక. దీని సీటు పొడవుగా, మృదువుగా ఉంటుంది. ఇది గుంతల రోడ్లపై కూడా సులభంగా వెళుతుంది. మీరు ద్విచక్ర వాహనంపై రోజులో 40-50 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లయితే, షైన్ మీకు డబ్బుకు విలువైన బైక్‌గా నిరూపిస్తుంది. అయితే ఈ బైక్‌ను కొనుగోలు చేసే ముందు, ఖచ్చితంగా దాని టెస్ట్ రైడ్ తీసుకోండి.