Last Updated:

Bajaj Freedom 125 Sales: నిన్ను ఓడించే వారు ఇంకా పుట్టలేదు మామ.. బజాజ్ ఫ్రీడమ్ 125 CNG రికార్డ్ సేల్స్.. ఎంతమంది కొన్నారంటే..?

Bajaj Freedom 125 Sales: నిన్ను ఓడించే వారు ఇంకా పుట్టలేదు మామ.. బజాజ్ ఫ్రీడమ్ 125 CNG రికార్డ్ సేల్స్.. ఎంతమంది కొన్నారంటే..?

Bajaj Freedom 125 Sales: బజాజ్ ఫ్రీడమ్ 125 CNG  కేవలం 6 నెలల్లోనే 40,000 యూనిట్లను విక్రయించింది. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ మా సిఎన్‌జి బైక్ బజాజ్ ఫ్రీడమ్ అద్భుతంగా ప్రారంభించిందని అన్నారు. ఆగస్టులో సరఫరాలను ప్రారంభించినప్పటి నుండి, దాదాపు 40,000 బైక్‌ల రిటైల్ అమ్మకాలను చేసాము. ఇది కస్టమర్ల ఇంధన ఖర్చులను సగానికి తగ్గించడమే కాకుండా బయో ఫ్యూయల్ సహాయంతో 300+కిమీల పరిధికి హామీ ఇవ్వడంతో మేము చాలా సంతృప్తి చెందాము. CNG నెట్‌వర్క్ ఉన్న మొత్తం 350 నగరాల్లో కంపెనీ దీన్ని విక్రయిస్తోంది.

Bajaj Freedom 125 Engine
బజాజ్ ఫ్రీడమ్‌లో 125 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది పెట్రోల్, సిఎన్‌జి రెండిటిలోనూ నడుస్తుంది. ఈ ఇంజన్ 9.5 పిఎస్, 9.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ సీటు కింద సిఎన్‌జి సిలిండర్ అమర్చారు. ఈ సిన్‌జి సిలిండర్‌ను అస్సలు కనిపించకుండా సెట్ చేశారు. ఇది 2కెజి సిఎన్‌జి సిలిండర్. అలానే దీనతో పాటు 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. ఇది 100కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Bajaj Freedom 125 Specifications
125సిసి విభాగంలో అతిపెద్ద సీటును కలిగి ఉంది. త్తు 785 మి.మీ. ఈ సీటు చాలా పొడవుగా ఉంది, ఇద్దరు వ్యక్తులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది బలమైన బలమైన ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. మోటార్‌సైకిల్‌లో LED హెడ్‌ల్యాంప్‌తో డ్యూయల్ కలర్ గ్రాఫిక్స్ ఉన్నాయి. దీని కారణంగా ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా మారుతుంది.

ఇందులో 11 భద్రతా పరీక్షలు చేశారు. కంపెనీ దీనిని 7 రంగులలో విడుదల చేసింది. లాంచింగ్‌తో దీని బుకింగ్ కూడా ప్రారంభమైంది. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ డీలర్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. మొదట దీని డెలివరీ మహారాష్ట్ర, గుజరాత్‌లలో ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఇది వచ్చే త్రైమాసికం నుండి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.

Bajaj Freedom 125 Price
ఇది 3 వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో NG04 డిస్క్ LEDలు, NG04 డ్రమ్ LEDలు , 125 NG04 డ్రమ్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ 125 NG04 డిస్క్ LED  ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 109,997, ఫ్రీడమ్ 125 NG04 డ్రమ్ LED  ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 95,002, ఫ్రీడమ్ 125 NG04 డ్రమ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,997.