Hero Upcoming Bikes 2025: గేమ్ ఛేంజర్.. హీరో నుంచి సింహాలు వస్తున్నాయ్.. ఈ ఐదే అందరి ఫేవరెట్..!
Hero Upcoming Bikes 2025: భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన హీరో మోటోకార్ప్ ఆటో ఎక్స్‌పో 2025లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. దీనిలో కంపెనీ అనేక సరికొత్త వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందులో హీరో జూమ్ 160ఆర్, ఎక్స్‌పల్స్ 210, హీరో కరిజ్మా XMR 250, హీరో ఎక్స్‌ట్రీమ్ 250 వంటి బైకులు ఉన్నాయి. ఈ బైక్స్‌లో అధునాతన ఫీచర్లు ఉంటాయి. రండి వీటన్నింటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Hero Xoom 160R
హీరో జూమ్ 160ఆర్ స్కూటర్‌ను హీరో మోటోకార్ప్ 2025 ఆటో ఎక్స్‌పో సందర్భంగా విడుదల చేయవచ్చు. ఈ సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ఇవ్వలేదు కానీ ఇది ఆటో ఎక్స్‌పో 2025లో ప్రారంభించనుందని భావిస్తున్నారు. ఈ స్కూటర్ EICMA 2023లో ప్రదర్శించారు. దీనిని సుమారు రూ. 1.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో తీసుకురావచ్చు.
Hero Xpulse 210
హీరో నుంచి కొత్త ఎక్స్‌పల్స్ 210ని ఆటో ఎక్స్‌పో 2025లో కూడా తీసుకురావచ్చు. ఇది 210 cc కెపాసిటీ గల DOHC లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ని కలిగి ఉంది, ఇది 24.5 బిహెచ్‌పి పవర్, 20.4 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఇస్తుంది. బైక్‌లో 210 ఎంఎం ఫ్రంట్, 205 ఎంఎం వెనుక సస్పెన్షన్, స్విచ్చబుల్ ఏబిఎస్ మోడ్‌లు, 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్, అసిస్ట్ క్లచ్, 220 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 4.2 అంగుళాల టిఎఫ్‌టి స్పీడోమీటర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 1.50 లక్షలు ఉండచ్చు.
Hero Karizma XMR 250
కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్‌ను హీరో భారత మార్కెట్లో అందిస్తోంది, అయితే ఇప్పుడు ఇది పెద్ద ఇంజన్‌తో పరిచయం చేయనుంది. ఇది 250 cc కెపాసిటీ గల DOHC 4V లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. దీని కారణంగా బైక్ 30 పిఎస్ పవర్, 25 న్యూటన్ మీటర్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. అలాగే, రేసింగ్ బైక్‌ల నుండి ప్రేరణ పొందిన వింగ్‌లెట్‌లతో దీన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించారు. బైక్ 6-స్టెప్ అడ్జస్ట్‌మెంట్ మోనోషాక్ సస్పెన్షన్‌తో అందించారు. LED లైట్లు, LED DRL సహా అనేక గొప్ప ఫీచర్లు బైక్‌లో చూడచ్చు.
Hero Xtreme 250
హీరో ఎక్స్‌ట్రీమ్ 250ని EICMA 2024లో 250 cc సెగ్మెంట్‌లో హీరో నేక్డ్ బైక్‌గా కూడా పరిచయం చేసింది. ఇది 250 cc కెపాసిటీ గల DOHC 4 వాల్వ్ ఇంజన్‌ని కలిగి ఉంది. దీని కారణంగా బైక్ 30 పిఎస్ పవర్, 25 న్యూటన్ మీటర్ టార్క్ పొందుతుంది. బైక్‌లో USD ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు 6-స్టెప్స్ అడ్జస్ట్ చేయగట మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఈ బైక్‌లో స్విచ్ చేయదగిన ABS మోడ్‌లు, LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్, LED DRL, TBT నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్‌తో పాటు ల్యాప్ టైమర్, డ్రాగ్ టైమర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
Hero Vida Z
విడాని హీరో MotoCorp ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అందిస్తోంది. Z స్కూటర్‌ను కంపెనీ విడా కింద ఆటో ఎక్స్‌పో 2025 సమయంలో కూడా ప్రారంభించవచ్చు. ఇది V2 నుండి ప్రేరణ పొందింది. కానీ ఇది V2 కంటే తక్కువ ధరకు అందించనుంది.