Last Updated:

Sajjala Bhargava Reddy: వైఎస్ జగన్, సజ్జల భార్గవ్ రెడ్డికి మరోసారి ఎదురుదెబ్బ.. విచారణకు కోర్టు నిరాకరణ

Sajjala Bhargava Reddy: వైఎస్ జగన్, సజ్జల భార్గవ్ రెడ్డికి మరోసారి ఎదురుదెబ్బ.. విచారణకు కోర్టు నిరాకరణ

Big Shock To Sajjala Bhargav Reddy: వైసీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మొదలైంది. ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఈ కేసులపై సుప్రీంకోర్టు ఫోకస్ చేసింది. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను రెండు వారాల్లో అందించాలని ఆదేశించింది. కిందికోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు, తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలను విడివిడిగా చార్టుల రూపంలో సబ్ మిట్ చేయాలని తెలిపింది. రెండువారాల్లో అన్ని వివరాలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని పేర్కొంది.

కేసు విచారణ ఆలస్యమవుతుందని రఘురామ పిటిషన్…
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ను రద్దు చేయడంతోపాటు, కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగ్ లో ఉండడమే అందుకు కారణమని న్యాయవాదులు తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని పేర్కొనగా, తదుపరి ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం చెప్పింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరికి వాయిదా వేయాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు. ధర్మాసనం అందుకు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది.

సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి, వైఎస్ జగన్ ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో చేసిన పోస్టుల విషయంలో తనపై నమోదైన కేసులను కొట్టి వేయాలని భార్గవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ పై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. రెండు వారాలపాటు భార్గవ్ ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అరెస్టు నుంచి భార్గవ్ కు రక్షణ కల్పించడంతో భారీ ఊరట దక్కినట్లయింది. రెండు వారాల తర్వాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? లేదా? అన్నది హైకోర్టే నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

సోషల్ మీడియా పోస్టులు ఆమోదయోగ్యంగా లేవు..
సజ్జల భార్గవ్ రెడ్డి టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పోస్టులను పరిశీలించిన తర్వాత ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భార్గవ్ సోషల్ మీడియా పోస్టులన్నీ ఆమోదయోగ్యంగా లేవని, సీరియస్ గా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నాన్ బెయిలబుల్ కేసు..
పులివెందులలో సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. భార్గవ్ సహా మరో ఇద్దరిపై సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న సమాచారం ఉంది. ఇటీవల ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా భార్గవ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.