Published On:

YS Jagan: నేడు ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు రైతుల పరామర్శ

YS Jagan: నేడు ప్రకాశం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు రైతుల పరామర్శ

Prakasam Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించనున్నారు. అలాగే పొదిలిలో ఉన్న పొగాకు బోర్డును కూడా సందర్శించనున్నారు. రైతలతో సమావేశమై వారి ససమస్యలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

 

ముందుగా తాడేపల్లిలోని తన నివాసం వైఎస్ జగన్ బయల్దేరి.. ఉ. 11 గంటలకు పొదిలి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పొగాకు బోర్డు కార్యాలయానికి వెళ్లనున్నారు. ఉ. 11.25 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముచ్చటించనున్నారు. ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.