Published On:

Cobra Vs King Cobra: కింగ్‌ కోబ్రా, కోబ్రాకు తేడా ఇదే.. కింగ్ కోబ్రా కోరల్లో ఎంత విషం ఉంటుందో తెలుసా..? ఒక్కసారి కాటు వేస్తే..!

Cobra Vs King Cobra: కింగ్‌ కోబ్రా, కోబ్రాకు తేడా ఇదే.. కింగ్ కోబ్రా కోరల్లో ఎంత విషం ఉంటుందో తెలుసా..? ఒక్కసారి కాటు వేస్తే..!

Difference between Cobra and King Cobra Venom: ఈ ప్రపంచంలో ఎన్నో వందల రకాల సర్పాలు ఉన్నాయి. అయితే అందులో చాలా వరకు ఎలాంటి విష రహితమైనవే ఉన్నాయి. కొన్నింటిలో అసలు విషమే ఉండదు. ఉన్నా.. దాని ప్రభావం పెద్దగా ఉండదు. కానీ. కొన్ని సర్పాల్లో మాత్రం అత్యంత శక్తివంతమై విషం ఉంటుంది. ముఖ్యంగా నాగుపాము జాతి సర్పాల విషం చాలా ప్రమాదమైనది. అయితే ఈ నాగుపాముల్లో రకరకాలు జాతులు ఉంటాయి. నాగుపాములను కోబ్రా అంటారనే విషయం తెలిసిందే. అయితే ఇందులో తరచుగా వినిపించేది కింగ్‌ కోబ్రా పేరు. కోబ్రా, కింగ్‌ కోబ్రా రెండు ఒకటే అనుకుంటారు చాలా మంది.

 

కానీ ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. నిజానికి వాటి మధ్య వ్యత్యాసం చాలా మందికి తెలియదు. వీటికి గురించి తెలుసుకోవాలని చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. కోబ్రా, కింగ్‌ కోబ్రాలు చూడటానికి భిన్నంగా ఉంటాయి, కానీ వాటి పేర్లు మాత్రం ఒకేలా ఎందుకు ఉన్నాయి? ఈరెండింటి మధ్య తేడా ఏంటీ? అని తెలుసుకోవాలంటే ఇక్కడో లుక్కేయండి. ఇవి ఓకే జాతికి చెందిన పాములు అయినప్పటికీ వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా మన చూట్టుపక్కల కనిపించే నాగుపాములు చిన్నగా, ఎల్లో కలర్‌లో ఉంటాయి. కానీ కింగ్‌ కోబ్రాలు మాత్రం నల్లని చర్మం, భారీ పొడవుతో చూడటానికి చాలా భయంకరం ఉంటాయి. వాటి పడగ కూడా విభిన్నంగా ఉంటుంది. ఈ కింగ్‌ కోబ్రాలను తెలుగులో కొండ నాగులు అంటారు. ఇవి ఎక్కువగా అడవుల్లో నివసిస్తుంటాయి.

 

సాధారణ నాగుపాములు నాజా జాతి అంటారు. ఈ నాజా కోబ్రాల కంటే కింగ్‌ కోబ్రాలో ఎన్నో రేట్లు శక్తివంతమైనవి. ఇతర కోబ్రాలో కంటే ఈ కింగ్‌ కోబ్రా ఎన్నో ప్రత్యేకమైన లక్షణాలు ఉన్ఆనయి. వీటి జీవనం, ఆహారపు అలవాట్లు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయట. కోబ్రాల్లోనే కింగ్‌ కోబ్రాలను రారాజు అని అంటారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో కింగ్‌ కోబ్రా ఒకటి. ఇవి ఆహారంగా ఇతర పాములనే తీసుకుంటాయి. వీటితో ఏ పాము పోరాడి గెలవలేదు. ఇలాంటి ఎన్నో వీడియోలను మనం చూసే ఉంటాం. సోషల్‌ మీడియాలో ఈ వీడియోలు చూస్తుంటం. ఇవి దాదాపుగా 18 అడుగులు (5.5 మిటర్ల) పోడవు పెరుగుతాయి. అత్యంత భారీ పోడవులో ఉంటే ఈ పాములు మనుషులంతా ఎత్తులోనూ నిలబడగలవు. పాకేటప్పుడు కూడా తలను చాలా పైకి పెట్టి వెళుతుంది.

 

ఇక దీని తల భాగం మిగతా కోబ్రాల కంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక దీని విషం కూడా అత్యంత ప్రమాదకరమైంది. ఒక్క కాటులో ఇది చిమ్మించే విషంతో 20 మంది, ఒక ఏనుగు మరణిస్తారట. ఒక్కసారి కాటు వేయగానే 7 మిల్లీలీటర్ల విషం విడుదల అవుతుంది. ఈ పాము కాటుకు గురైన వారికి వెంటనే చికిత్స అందించాలి లేదంటే వారి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కింగ్‌ కోబ్రా కాటు వేసిన 30 నిమిషాల్లోనే చనిపోతారట. మొదట దీని విషయ ప్రభావం నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. అది మెల్లిమెల్లిగా పక్షపాతం, శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. వీటిలో కైట్స్‌, ఇతర కోబ్రాస్‌ వంటి విషపూరిత జాతులతో పాటు ఇతర పాములను, బల్లులు, ఎలుకలు, పక్షులను ఆహారంగా తీసుకుంటాయట. కానీ ఇది ఎక్కువగా పాములను తినడానికే ఇష్టపడుతుందట.

 

ఇవి కూడా చదవండి: