Published On:

TTD Deputy EE Sri Lakshmi: హత్యాయత్నం కేసులో టిటిడి డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్

హత్యాయత్నం కేసులో టిటిడి డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలక్ష్మీతోపాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిసి కెమెరా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

TTD Deputy EE Sri Lakshmi: హత్యాయత్నం కేసులో టిటిడి డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్

 TTD Deputy EE Sri Lakshmi: హత్యాయత్నం కేసులో టిటిడి డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలక్ష్మీతోపాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిసి కెమెరా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

ఎదురెదురు ఫ్లాట్లలో నివాసాలు..( TTD Deputy EE Sri Lakshmi)

. ఈనెల 25న తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శివారెడ్డి. ఆపార్ట్‎మెంట్ ముందే బైక్‎తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. కత్తితో తలపై నరకడంతో శివారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అపార్ట్‎మెంట్‎లో శివారెడ్డి, శ్రీలక్ష్మీ ఎదురెదురు ఫ్లాట్లలో నివాసముంటున్నారు. గతంలో కూడా శివారెడ్డితో అనేక సార్లు శ్రీలక్ష్మీ దంపతులు గొడవకు దిగారు. సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.అలిపిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: