Published On:

Huge Discount on Maruti Jimny: గర్వపడేలా చేసింది.. మారుతి జిమ్నీపై రూ. 70,000 డిస్కౌంట్.. మరికొన్ని రోజులే ఛాన్స్!

Huge Discount on Maruti Jimny: గర్వపడేలా చేసింది.. మారుతి జిమ్నీపై రూ. 70,000 డిస్కౌంట్.. మరికొన్ని రోజులే ఛాన్స్!

Rs 70,000 Discount on Maruti Jimny in July: మారుతి సుజుకి ఇండియా నెక్సా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ ఆఫ్‌రోడింగ్ జిమ్నీ ఎస్‌యూవీ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ కారుపై కంపెనీ రూ. 70,000 నగదు తగ్గింపును అందిస్తోంది. అయితే, గత కొన్ని నెలలతో పోలిస్తే కంపెనీ తన డిస్కౌంట్‌ను తగ్గించింది. గతంలో కంపెనీ లక్ష రూపాయల తగ్గింపును అందించేది. జిమ్నీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.76 లక్షలు. భారత మార్కెట్లో జిమ్నీ అమ్మకాలు చాలా తగ్గాయి, కానీ జపాన్‌లో దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. జిమ్నీ బలంతో, కంపెనీ మెర్సిడెస్-బెంజ్‌ను కూడా వెనక్కి నెట్టింది.

 

జిమ్నీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

జిమ్నీ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల K15B మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది గరిష్టంగా 105 హెచ్‌పి పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ MT లేదా 4-స్పీడ్ AT ట్రాన్స్‌మిషన్‌తో జతచేసి ఉంటుంది. దీనిలో ఎలక్ట్రిక్‌గా అడ్జస్ట్ చేయగల ఓఆర్‌వీఎమ్‌లు, వాషర్‌తో ముందు, వెనుక వైపర్, డే అండ్ నైట్ ఐఆర్‌విఎమ్, పించ్ గార్డ్‌తో డ్రైవర్-సైడ్ పవర్ విండో ఆటో అప్/డౌన్, రిక్లైనబుల్ ఫ్రంట్ సీట్లు, మౌంటెడ్ కంట్రోల్‌లతో మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లే, ముందు , వెనుక సీటు సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు, ముందు, వెనుక వెల్డెడ్ టో హుక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

జిమ్నీలో స్టీల్ వీల్స్, డ్రిప్ రైల్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది. ఆల్ఫా గ్రేడ్ అల్లాయ్ వీల్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, వాషర్‌తో ఎల్ఈడీ ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, డార్క్ గ్రీన్ కలర్ టిన్టెడ్ గ్లాస్, పుష్ బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, లెదర్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆర్కామిస్ సరౌండ్ సౌండ్ కూడా ఉన్నాయి.

 

భద్రత కోసం ఈ కారులో స్టాండర్ట్‌గా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, ఈబీడీతో యాంటీ-లాక్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సైడ్-ఇంపాక్ట్ డోర్ బీమ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, త్రీ పాయింట్ ఎమర్జెన్సీ లాకింగ్ రిట్రాక్టర్ సీట్‌బెల్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

ఇవి కూడా చదవండి: