Breakup Revenge: మాజీ ప్రియుడి కోసం 100 పిజ్జాలు ఆర్డర్.. వాలెంటైన్స్ డేకి దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి!

Girl Shocks Boyfriend on Valentines Day: వాలెంటైన్స్ డేకి ప్రేమికులు తమ పార్ట్నర్స్కి ఖరీదైన బహుమతులతో ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ వారు కొత్తగా ఆలోచిస్తున్నారు. గిఫ్ట్స్‌తో పాటు వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కొందరు ఈ వాలెంటైన్ డేకి రివేంజ్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువతి తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకుంది. అతడి కోసం పిజ్జాలు ఆర్డర్ చేసి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకి ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యువతి యష్ అనే యువకుడి కోసం ఆన్లైన్లో పిజ్జాలు పెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 పిజ్జాలు ఆర్డర్ పెట్టింది. అవన్నింటి డెలివరి యష్‌కు ఇంటికి వెళ్లి డోర్ డెలివరి చేశారు. ఇక్కడి వరకు అంతా బాగున్నా అసలు విషయంలో తెలిసి ఆ యష్ కంగుతిన్నారు. ఈ పిజ్జాలన్నింటిని యువతి క్యాష్ ఆన్ డెలివరి పెట్టింది. పిజ్జాలన్నింటిని ఆర్డర్ చేశాక డెలివరి బాయ్ యష్‌ని డబ్బులు కట్టాలని చెప్పాడు. అది విని అతడు షాక్ అయ్యాడు.
మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చిన యువతి – వాలెంటైన్ సర్ప్రైజ్ Turns into Trouble!
వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యువతి తన మాజీ ప్రియుడికి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.
అతడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో 100 పిజ్జాలను ఆర్డర్ చేసింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే, ఆ పిజ్జాలు క్యాష్ ఆన్ డెలివరీ… pic.twitter.com/azjqzlZkq0
— Aadhan Telugu (@AadhanTelugu) February 14, 2025
ఈ పిజ్జాలు తను ఆర్డర్ చేయలేదని, డబ్బులు కట్టలేనని చెప్పాడు. ఈ క్రమంలో యష్‌కి, డెలివరి బాయ్‌కి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఈ ఆర్డర్ ఎవరు చేశారో తెలిసి యష్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘వాలెంటైన్స్ డే అంటే ప్రేమను వ్యక్తం చేసుకోవడమే కాదు.. కోపాన్ని కూడా చూపించుకోవచ్చు అన్న మాట’, ‘భలే రివేంజ్ ప్లాన్ చేసింది’ అంటూ నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- YS Jagan on Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్ అత్యంత దారుణం: మాజీ సీఎం వైఎస్ జగన్!