Monalisa Director Arrest: లైంగిక వేధింపులు – కుంభమేళ మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

Big Twist in Kumbh Mela Monalisa Director Case: కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఓ యువతిని సినిమా ఆఫర్ల పేరుతో నమ్మించి వేధింపులకు పాల్పడ్డాడని, పలుమార్లు తనపై శారీరక వేధింపులకు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసాను ఇండస్ట్రీకి పరిచయం చేసే బిజీలో ఉన్న ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అంతా మోనాలిసా కెరీర్ అంతే అంటున్నారు.
కాగా మహాకుంభమేళతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది మోనాలిసా. కుంభమేళలో పూసలు అమ్ముకుంటున్న ఆమెను అక్కడికి వెళ్లిన కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెనేకళ్లతో, పొడవాటి జుట్టుగా అందంగా ఉండటంతో అంతా ఆమె వెంటే పడ్డారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇంకేముందు ఒక్కసారిగా ఆమె లైమ్‌లైట్లోకి వచ్చింది. దీంతో ఆమె కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసాగా మారిపోయింది. ఆమె వీడియోలో చూసి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు మూవీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి మోనాలిసాని కలిసి ఆమెకు మూవీ ఆఫర్ ఇచ్చాడు.
అంతేకాదు యాక్టింగ్, డ్యాన్స్‌లోనూ శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకున్నాడు. ఇక త్వరలోనే ఆమెను నటిగా ఆరంగేట్రం చేస్తున్నసమయంలో షాక్ తగిలింది. మోనాలిసాను హీరోయిన్‌గా పరిచయం చేసే బాధ్యత తీసుకున్న ఆయనపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల వయసున్న ఓ అమ్మాయికి సినిమా ఆఫర్ ఇస్తానని లోబరుచుకున్నాడని, ముంబైలో కొన్నేళ్ల పాటు సహాజీవనం కూడా చేశామని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. బలవంతంగా తనకు అబార్షన్ కూడా చేయించాడని, ఇప్పుడు మోసం చేస్తున్నాడని ఆరోపించింది.
ఆమె ఫిర్యాదు మేరకు నబీ కరీం పోలీసు స్టేషన్‌లో మిశ్రపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. ఈ నెల 6వ తారీఖున సనోజ్ మిశ్రాపై కేసు నమోదైనట్టు సమాచారం. అయితే ఇప్పుడీ కేసులో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. సనోజ్ మిశ్రాపై ఫిర్యాదు చేసిన యువతే తాజాగా ఓ సంచలన వీడియో రిలీజ్ చేసింది. సనోజ్ మిశ్రా అమాయకుడంటూ సదరు యువతి వీడియో చేయడం ఇప్పుడు సెన్సేషన్‌గా అయ్యింది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, సనోజ్ అమాయకుడని సదరు యువతి తెలిపింది. కావాలనే ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సదరు యువతి పేర్కొంది. ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను సనోజ్‌తో ఉండటం, ఇద్దరి మధ్య గొడవల ఉండటమే నిజమే అని చెప్పింది. అయితే ఆయన ఎప్పుడు తనపై వేధింపులకు పాల్పడలేదని ఆమె చెప్పుకోచ్చింది.