Amala Paul : మళ్ళీ పెళ్ళికి రెడీ అవుతున్న అమలాపాల్.. కాబోయే భర్తకు ముద్దులు
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ లో ఉన్న హీరోయిన్లలో అమలా పాల్ కూడా ఒకరు. కాగా ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత రామ్ చరణ్ నాయక్, పలు చిత్రాల్లో నటించి ఆడియన్స్ ని అలరించింది.
Amala Paul : తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ లో ఉన్న హీరోయిన్లలో అమలా పాల్ కూడా ఒకరు. కాగా ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత రామ్ చరణ్ నాయక్, పలు చిత్రాల్లో నటించి ఆడియన్స్ ని అలరించింది.
కానీ దురదృష్టవశాత్తు నటి అమలాపాల్ వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల కారణంగా సినిమా పరిశ్రమ కి కూడా కొంతమేర దూరంగా ఉంటోంది. అయితే విడాకుల అనంతరం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది ఈ భామ. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా సై అంటుంది. ఆమె సినిమాలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. ఆ విషయంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అదే విధంగా అమలాపాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఘాటు అందాలని ఆరబోస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.
అయితే తాజాగా అమలా పాల్ రెండో పెళ్లికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన 32 వ బర్త్ డే రోజు ఆమె బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. జగత్ దేశాయ్ ఆమెకు నేలపై కూర్చుని ప్రపోజ్ చేయడమే కాదు .. వేలికి రింగ్ తొడిగాడు. వెంటనే అమలా అతనికి ముద్దిచ్చింది. ‘ నా జిప్సీ క్వీన్ ఎస్ అంది’ అనే కాప్షన్ తో జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
విజయ్ – అమలా పాల్ విడాకులు..
చిత్ర పరిశ్రమలో నటిగా అడుగు పెట్టిన మూడు సంవత్సరాలకు అమలా పాల్ వివాహం చేసుకున్నారు. తమిళంలో విక్రమ్ ‘దైవ తిరుమగల్’లో ఆమె తొలిసారిగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ చేసేటప్పుడు దర్శకుడు ఏఎల్ విజయ్, అమలా పాల్ ప్రేమలో పడ్డారు. వాళ్లిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే…పలు కారణాల రీత్యా 2017 లో విడాకులు తీసుకున్నారు.
జగత్ దేశాయ్ విషయానికి వస్తే.. సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తిగా కనిపించడం లేదు. వీరిద్దరి మధ్య కొన్నాళ్ల క్రితమే ప్రేమ చిగురించినట్లు అర్థం అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన మమ్ముట్టి ‘క్రిస్టోఫర్’లో అమలా పాల్ నటించారు. హిందీలో అజయ్ దేవగణ్ ‘భోళా’ (కార్తీ ఖైదీ రీమేక్)లో ప్రత్యేక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం రెండు మలయాళ సినిమాల్లో అమలా పాల్ నటిస్తున్నారు.
View this post on Instagram