Slap Day 2025: ప్రేమలో ఓడిపోయారా? అయితే ‘స్లాప్ డే’ మీకోసమే!

Slap Day Anti-Valentine’s Week 2025: ప్రేమికులు వాలెంటైన్స్ వీక్‌లో తమను ప్రేమించిన వారితో పార్టీకో, డిన్నర్ కో వెళ్లి ఎంజాయ్ చేశారు. మరికొంతమంది ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేకు కూడ స్వర్ణమేలే’ అనే పాటను గుర్తుకువచ్చేలా గడిపారు. ఇలా ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమైన ఈ వాలెంటైన్స్ వీక్.. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేతో ముగిసింది. అయితే నేటి నుంచి యాంటీ-వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతోంది. ఈ వాలెంటైన్స్ వీక్ స్లాప్ డేతో ప్రారంభమవుతోంది. ఈ స్లాప్ డే అంటే ఏంటి? ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమలో ఓడిపోయిన లేదా ప్రేమలో మోసం పోయిన వారు ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్‌ను నిర్వహించుకుంటారు. ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఉంటుంది. ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్‌లో స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెష్షన్ డే, మిస్సింగ్ డే ఉంటాయి. వీటిని కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో తొలి రోజును స్లాప్ డేగా చేసుకుంటారు.
ప్రియురాలు లేదా ప్రియుడు చేతిలో మోసపోయిన వారు తమ కోపాన్ని తీర్చుకోవడంతో పాటు తమ జ్ఞాపకాలను పూర్తిగా మరచిపోయేందుకు స్లాప్ డేను చేసుకుంటారు. ఇందులో భాగంగానే తమను మోసం చేసిన మాజీ ప్రియుల చెంప చెల్లుమనిపించేలా కొట్టి తమ భావాలను వ్యక్తం చేస్తారు. అనంతరం అన్ని మరచిపోయి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు. స్లాప్ డేకి శుభాకాంక్షలు సందేశాలు చూద్దాం.
- ఒకరి ముఖం మీద కొట్టాల్సిన అవసరం లేదు.. కానీ మీ మాటలతో ఎవరినైనా కొట్టడం చాలా అవసరం ఎందుకంటే అవి ఎక్కువ బాధపెడతాయి. హ్యాపీ స్లాప్ డే.
- నన్ను మోసం చేసిన వ్యక్తిని ప్రేమించడం వల్ల నాకు నష్టం లేదు.. కానీ నిన్ను బేషరతుగా ప్రేమించిన వ్యక్తిని నువ్వు కోల్పోవడం వల్ల నీకే నష్టం. హ్యాపీ స్లాప్ డే.
- చెంపదెబ్బ అంటే మీ దూకుడును విడుదల చేసే ప్రతిచర్య తప్ప మరొకటి కాదు. హ్యాపీ స్లాప్ డే.
- నువ్వు నాకు ప్రతి కారణం చెప్పినందువల్లే నేను నీతో అన్ని సంబంధాలను తెంచుకున్నాను. స్లాప్ డేకి శుభాకాంక్షలు.