Ram Charan Tej : సల్మాన్ ఖాన్, వెంకటేష్ తో కలిసి స్టెప్పులేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్". ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో

Ram Charan Tej : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం “కిసీ కా భాయ్ కిసీ కీ జాన్”. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతి బాబు, విజేందర్ సింగ్, అభిమన్యు సింగ్, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. అలాగే టాలీవుడ్ స్టార్ వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుండగా.. పూజాహెగ్డే అన్నగా వెంకటేష్ చేస్తున్నారు.
అయితే మంగళవారం నాడు ఈ సినిమా నుంచి ఏంటమ్మా అనే సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేశారు. ఆ ప్రోమో చివర్లో మరో హీరో ఎంట్రీ అయినట్లు చూపించి ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఈరోజు తాజాగా ఆ ట్విస్ట్ ని రివిల చేస్తూ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సల్మాన్ ఖాన్, వెంకటేష్ తో కలిసి స్టెప్పులేశారు. సాంగ్ ఆద్యంతం కంప్లీట్ గా సౌత్ ఇండియన్ స్టైల్లో పంచెకట్టుతో అదరగొట్టగా.. సాంగ్ చివరిలో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి క్యాచీ స్టెప్స్ తో అదరగొట్టారు.
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ఏంటమ్మా సాంగ్ (Ram Charan Tej)..
ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. ఇక పోతే సల్మాన్ ఖాన్, మెగా ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవి కోసమే ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ స్పెషల్ రోల్ చేశారు. పతాక సన్నివేశాల్లో చిరు, సల్మాన్ సీన్లు హైలైట్ అయ్యాయి! ఆ సినిమాకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సల్మాన్ చేశారని చిరు కూడా తెలిపారు. హిందీలో రామ్ చరణ్ ‘జంజీర్’ చేసినప్పుడు కూడా ఆయన మద్దతు ఇచ్చారని.. సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వస్తే తప్పకుండా మెగాస్టార్ ఇంటికి రాకుండా వెళ్ళారని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఆ అనుబంధం కారణంగా సల్మాన్ సినిమాలోని సాంగులో రామ్ చరణ్ కనిపించారని అంతా భావిస్తున్నారు.
One of my most precious on screen moments.
Love you BhaiDancing with these absolute legends… #Yentamma song out now.https://t.co/9gSJhidu0y@BeingSalmanKhan @hegdepooja @VenkyMama @farhad_samji @VishalDadlani @iPayalDev @raftaarmusic @Musicshabbir @AlwaysJani pic.twitter.com/raRa2zl8Zy
— Ram Charan (@AlwaysRamCharan) April 4, 2023
ఇవి కూడా చదవండి:
- Congress Files second Episode: కాంగ్రెస్ ఫైల్స్ రెండవ ఎపిసోడ్‌ను విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ
- TS 10th Exams: వాట్సాప్‌లోకి హిందీ ప్రశ్నపత్నం.. వరుసగా రెండో రోజు లీక్
- MS Dhoni: ధోని ఆటను వీక్షించిన 1.7 కోట్ల మంది