Published On:

Trivikram: త్రివిక్రమ్.. ఆ సీనియర్ హీరోతో హ్యాట్రిక్ కొడతాడా.. ?

Trivikram: త్రివిక్రమ్.. ఆ సీనియర్ హీరోతో హ్యాట్రిక్ కొడతాడా.. ?

Trivikram: టాలీవుడ్ డైరెక్టర్స్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ అనే చెప్పాలి. ఆయన సినిమాల కంటే ఆయన డైలాగ్స్ కే అభిమానులు ప్రాణం ఇచ్చేస్తారు. అంతలా ప్రేక్షకులను అలరించే త్రివిక్రమ్ .. ఈ మధ్య సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం లేదు అనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో అల్లు అర్జున్ సినిమా ఒక్కటే ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. బన్నీ కొద్దిగా టైమ్ ఇచ్చి.. ఈ గ్యాప్ లో అట్లీ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

 

ఒకవేళ ఈలోపు కనుక త్రివిక్రమ్ ఆ పనులను పూర్తి చేస్తే.. రెండు సినిమాలను ఒకేసారి ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. అయితే అట్లీ, బన్నీ సినిమా అంటే మామూలు విషయం కాదు. ఎంత లేదనుకున్నా ఒక ఏడాది పడుతుంది. ఈలోపు గురూజీ ఖాళీగా ఎందుకు ఉండడం అని పెండింగ్ లో ఉన్న ఒక సినిమాను పట్టలెక్కిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో కి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే.

 

నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన ఈ కాంబో ఇంకోసారి రిపీట్ అయితే చూడాలని అభిమానులు కలలు కంటున్నారు. వీరి కాంబో లో మూడో సినిమా రాబోతుందని గతంలో అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. 2017 నుంచి పెండింగ్ లో ఉన్న ఈ సినిమాను త్రివిక్రమ్ ఇప్పుడు బయటకు తీయనున్నాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం గురూజీ మాటను బట్టే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

 

వెంకీ మామ.. త్రివిక్రమ్ సినిమా అంటే అన్ని సినిమాలు ఆపేసి అయినా చేస్తాడు. అందులోనూ వెంకీ.. ప్రస్తుతం మెగా 157 లో నటిస్తున్నాడు. ఇది కాకుండా కొత్త ప్రాజెక్టులు ఏమి ప్రకటించలేదు. ఇప్పుడు కనుక గురూజీ ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే.. మిగతా సినిమాల కంటే ఇదే ఎక్కువ హైప్ ను క్రియేట్ చేస్తుంది. మరి గురూజీ ఈ సినిమాకు ఓకే చెప్పి హ్యాట్రిక్ కొడతాడా..? లేదా..? అనేది చూడాలి.