Last Updated:

Motorola Edge 60 Fusion Launch: వావ్ ఇంట్రెస్టింగ్.. డ్యూయల్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?

Motorola Edge 60 Fusion Launch: వావ్ ఇంట్రెస్టింగ్.. డ్యూయల్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?

Motorola Edge 60 Fusion Launch: చివరగా మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. అధికారిక లాంచ్‌కు ముందు మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను మోటో వెల్లడించింది. ఫోన్ కలర్, డిజైన్ సమాచారాన్ని షేర్ చేసింది. అయితే, ఇప్పుడు మోటరోలా తన సరికొత్త ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లను వివరంగా తెలుసుకుందాం.

 

Moto Edge 60 Fusion Price
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.25 వేల లోపు ధరకే విడుదలైంది. దీని రెండు వేరియంట్‌లు – 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ లాంచ్ చేసింది. 8GB RAM + 256GB స్టోరేజ్‌ రూ. 22,999, 12GB RAM + 256GB స్టోరేజ్‌ రూ. 24,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, పింక్, పర్పుల్ వంటి కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయింది.

 

Motorola Edge 60 Fusion Sale
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ 9 ఏప్రిల్ 2025న జరగనుంది. ఈ ఫోన్ మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. మోటరోలా వెబ్‌సైట్ కాకుండా, మీరు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా ఎడ్జ్ 60ని కొనుగోలు చేయచ్చు. 20,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్‌ని ఆర్డర్ చేయచ్చు. ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉంటాయి. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గుతుంది.

 

Moto Edge 60 Fusion Specifications
మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ప్రపంచంలోనే అత్యంత లీనమయ్యే బ్రైట్‌నెస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1.5K ఆల్-కర్వ్డ్ డిస్‌ప్లే. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్డ్ చేయడానికి IP69 రేటింగ్ అందించారు. ఈ ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500 mAh బ్యాటరీ ఉంది. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అందులో 50MP సోనీ LYT 700ప్రైమరీ కెమెరా, 13MP సెకండరీ సెన్సార్‌ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌పై ఫోన్ పనిచేస్తుంది.