Last Updated:

Moto G15: మోటో కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్ ధరకే.. ఫీచర్లు చూస్తే నమ్మలేరు!

Moto G15: మోటో కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్ ధరకే.. ఫీచర్లు చూస్తే నమ్మలేరు!

Moto G15: స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటరోలా తన అభిమానులకు  గొప్పి శుభవార్తను అందించింది. ఎంతగానో ఎదురుచూస్తున్న Moto G15 ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కావడం ఖాయమని తెలుస్తోంది. ఇది గొప్ప ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ  రాబోయే Moto G15 ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? ధర, తదితర వివరాలు తెలుసుకుందాం.

కొత్త Moto G15 ఫోన్‌లోని అనేక కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల కానుంది. ఈ ఫోన్ Mali G52 MC2 GPU గ్రాఫిక్స్ కార్డ్‌తో అమర్చబడి ఉంటుంది. Moto G15 ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 4GB RAM, 6.5 అంగుళాల HD Plus డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో సరసమైన ధరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Moto G15 మొబైల్ రూ.10,000 కంటే ఎక్కువ బడ్జెట్‌లో విడుదల కానుంది. కంపెనీ మోటో G14 ఫోన్‌ను రూ.9,999కి విడుదల చేసింది. అందువల్ల Moto G15 భారతీయ మార్కెట్‌లో అదే సెగ్మెంట్‌లో ధర ఉండే అవకాశం ఉంది. మోటో G14 ఫోన్ స్కై బ్లూ, స్టీల్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు

Moto G14 Features
మోటో G14 ఫోన్‌లో 6.5-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 2400 × 1080 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో సహా అనేక ఫీచర్లను లిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 2GHz UNISOC T616 (UNISOC T616) ఆక్టా కోర్ 12nm ప్రాసెసర్‌తో రానుంది. ఇది గ్రాఫిక్స్ కోసం Mali G57 GPU సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్‌తో లాంచ్ అయింది. ఫోన్‌లో 1TB వరకు మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ సపోర్ట్ ఉంది.

స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,  2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫోటోలను తీయచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 8MP కెమెరాతో వస్తుంది. అంతేకాకుండా ఇది LED ఫ్లాష్,  వివిధ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది.

ఈ Moto G14 స్మార్ట్‌ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని ఉంది. ఈ ఫోన్ లాండ్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.  మొబైల్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoltE, Wi-Fi 802.ac, బ్లూటూత్ 5.0, USB టైప్-C పోర్ట్, GPS మొదలైనవి ఉన్నాయి.