Published On:

Infinix Note 50s 5G Plus Launch: బడ్జెట్‌లో బీభత్సం.. ఇన్ఫినిక్స్ Note 50s 5G ప్లస్.. మీ చుట్టూ సువాసనలే!

Infinix Note 50s 5G Plus Launch: బడ్జెట్‌లో బీభత్సం.. ఇన్ఫినిక్స్ Note 50s 5G ప్లస్.. మీ చుట్టూ సువాసనలే!

Infinix Note 50s 5G Plus Launch: ఇన్ఫినిక్స్ గత వారం భారతదేశంలో Infinix Note 50s 5G+ ఫోన్‌ను ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో మొబైల్ నుండి సువాసనను తీసుకువచ్చే సెంట్-టెక్ ఫీచర్ ఉంటుంది. అదే సమయంలో, ఫోన్ మార్కెట్లోకి రాకముందే, కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ 50S 5G ప్లస్ ఫీచర్లు , స్పెసిఫికేషన్లను కూడా ఆవిష్కరించింది. ఈ రాబోయే 5G ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? దాని ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం.

 

ముందుగా లాంచ్ వివరాల గురించి మాట్లాడుకుంటే, ఇన్ఫినిక్స్ నోట్ 50S 5జీ ఏప్రిల్ 18న భారతదేశంలో లాంచ్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు, కంపెనీ ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫోన్ ధర, సేల్ వివరాలను ఆవిష్కరిస్తుంది. ఈ ఫోన్ ప్రకటనను ఇన్ఫినిక్స్ వెబ్‌సైట్‌తో సహా బ్రాండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ చూడచ్చు. నోట్ 50S 5G+ ఫోన్ టైటానియం గ్రే, రూబీ రెడ్ ,మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్స్‌లో మార్కెట్లోకి తీసుకొస్తుంది.

 

Infinix Note 50s 5G+ Specifications
ఇన్ఫినిక్స్ నోట్ 50S 5G+ ఆండ్రాయిడ్ 15 పై లాంచ్ అవుతుంది, ఇది XOS 15 తో కలిసి పనిచేస్తుంది. ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ అందించారు. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ 700K+ AnTuTu స్కోర్‌ను సాధించగలదు. దీనిలో 90fps గేమింగ్ చేయవచ్చు.

 

Infinix Note 50s 5G+ Battery
పవర్ బ్యాకప్ కోసం ఈ 5G ఫోన్ 5,500 mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్ అవుతుంది. పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి, మొబైల్ ఫోన్‌కు 45W ఆల్-రౌండ్ ఫాస్ట్‌చార్జ్ 3.0 టెక్నాలజీ అందించారు.

 

Infinix Note 50s 5G+ Camera
ఫోటోగ్రఫీ కోసం, ఇన్ఫినిక్స్ నోట్ 50S 5+ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఇచ్చారు. దాని వెనుక ప్యానెల్‌లో, డ్యూయల్ LED ఫ్లాష్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ మెయిన్ సోనీ IMX682 సెన్సార్ ఉంది, ఇది 10x డిజిటల్ జూమ్, AI హాలో టైమర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ముందు ప్యానెల్‌లో 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

 

Infinix Note 50s 5G+ Display
ఇన్ఫినిక్స్ నోట్ 50s స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ డిస్‌ప్లేతో లాంచ్ అవుతుంది. ఇది పంచ్-హోల్ స్టైల్ కర్వ్డ్ AMOLED స్క్రీన్, ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ 5G‌లో ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ కూడా పొందుతుంది.

 

Infinix Note 50s 5G+ Other Features
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ మన్నికతో వస్తుంది. నీరు, ధూళి నుండి మొబైల్‌ను రక్షించడానికి, దీనికి IP64 రేటింగ్ ఇచ్చారు. ఈ 5G ఫోన్‌లో, వినియోగదారులు IR బ్లాస్టర్,యాక్టివ్ హాలో లైటింగ్‌తో సహా AI ఆధారిత కెమెరా ఫీచర్‌లను కూడా పొందుతారు.