Home / Telangana
CM Revanth Reddy petition in the High Court : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో కేసు ఉన్న నేపథ్యంలో దానిని కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో రేవంత్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. బీజేపీకి పరువు నష్టం కలిగేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ […]
BRS Party Leader KTR Comments KCR Meeting: రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్‌లోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత 11 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. గులాబీ సైనికులు కేసీఆర్ సందేశాన్ని ప్రతీ గ్రామానికి చేర్చాలని కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలతో […]
Student suicide : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని కుటుంబానికి తీరని శోకం మిగుల్చుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పటి వరకు 6 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అశ్విత తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తీవ్ర […]
BRS Working President KTR : వికారాబాద్ జిల్లాలోని లగచర్ల బాధితులను కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి వారి పేర్లు రాసిపెట్టుకుంటామని తెలిపారు. మరో మూడేండ్లలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అతిగా చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రిటైర్డ్ అయి ఎక్కడ ఉన్నా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రజతోత్సవ […]
SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన సంగతి తెలిసిందే. మిగిలిన 6 మంది మృతదేహాల వెలికితీతకు బ్రేక్ పడింది. ఇప్పటివరకు 281 మీటర్లలో పేరుకుపోయిన మట్టి, బండ రాళ్లను తొలగించారు. లోకో రైలు, కన్వేయర్ బెల్టు ద్వారా బయటికి తరలించారు. మిగిలిన 43 మీటర్లలో తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా, ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీంతో మృతదేహాల వెలికితీత నిలిచిపోయింది. కేవలం టన్నెల్లో వాటర్గ్ ప్రక్రియ, మట్టి, స్టిల్ కటింగ్‌లను బయటికి […]
Film Awards : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకు వేదిక ఖరారు అయింది. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు ఏర్పాట్లకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇస్తున్నది. అవార్డుల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జ్యూరీ చైర్మన్‌గా ప్రముఖ నటి జయసుధతోపాటుగా 15 మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్‌రాజు, జయసుధ […]
CRPF Big Operation Against Maoist in Karreguttalu: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి కాల్పుల మోత జరిగింది. తెలంగాణ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల మోతకు భయపడి కర్రెగుట్ట వైపు మావోయిస్టులు పారిపోయారు. కాగా, ఇప్పటికే పారా మిలిటరీ బలగాలు వేలసంఖ్యలో ఛత్తీస్‌గఢ్ చేరుకున్నాయి. అయితే శాంతి చర్చలు అంటూనే ఎన్ కౌంటర్లు చేయడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటించాలని ప్రొఫెసర్ హరగోపాల్ […]
Heat Wave in Telangana: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకు బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. పలు చోట్ల 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కావున అనవసరంగా ఎవరూ బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని […]
Telangana Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు www.tgbie.cgg.gov.in వెబ్‌సైట్ క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 66.89శాతం ఉత్తీర్ణత.. ఇంటర్ […]
TG Inter Results : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని విద్యాభవన్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య ఫలితాల విడుదల తేదీ, సమయం ఖరారు చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ […]