Home / Telangana
Telangana Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు www.tgbie.cgg.gov.in వెబ్సైట్ క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 66.89శాతం ఉత్తీర్ణత.. ఇంటర్ […]
TG Inter Results : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని విద్యాభవన్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య ఫలితాల విడుదల తేదీ, సమయం ఖరారు చేశారు. విద్యార్థులు ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ […]
Revanth Reddy : తెలంగాణలో ‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి లాంటి మంచి భవిష్యత్ ఉన్న యువకులు మధ్యలోనే తమ జీవితాలను ముగించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని రేవంత్‌రెడ్డిని రాహుల్ లేఖలో కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ […]
High Court : వేములవాడ బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై గతంలో ఇచ్చిన తీర్పుపై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని భారత పౌరుడు కాదని, జర్మనీ పౌరుడని ధర్మాసనం తేల్చి చెప్పింది. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. చెన్నమనేని కోర్టు ఖర్చుల […]
Medak Road Accident : రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేట స్టేజీ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి షాపూర్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి మెదక్ వైపు ఆల్టో కారు వెళ్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఆల్టో కారును ఢీకొట్టింది. దీంతో ఆల్టోకారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం […]
BRS EX Minister KTR Big Relief In High Court of Telangana: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్‌లో ఉట్నూరు పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. అంతకుముందు మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ రూ.25వేల కోట్ల నిధులను తరలించిందంటూ […]
BRS Working President KTR : ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన చేశారు. రాజేంద్రనగర్‌లో పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి గెలిస్తారని జోస్యం చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజలే నష్టపోయారని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాయమాటలకు వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారని తెలిపారు. మతం పేరు పలుకకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీ పార్టీకి ఉందా? అని సవాల్ […]
Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో హామీ మేరకు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తూ భర్తీ చేస్తుంది. ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు వివిధ శాఖల్లో భర్తీ చేసింది. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. త్వరలో ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ వెల్లడించారు. 3,038 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చిందని తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. సాధ్యమైనంత […]
CM Revanth Reddy : తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా శనివారం అక్కడ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్‌ఫ్రంట్‌ను పరిశీలించినట్లు తెలిపారు. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ పరిస్థితిని చూసి మనం […]
BRS Working President KTR : హైదరాబాద్ నగరంలోని కాలనీలు, బస్తీల్లో గులాబీ జెండా ఎగురవేసి, ఈ నెల 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో శనివారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. […]