Home / Telangana
Telangana high court Justice Girija Priyadarsini Passed Away: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించారు. విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఎన్బీఎమ్ లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అలాగే లేబర్ అండ్ ఇండస్ట్రీలా లో మాస్టర్స్ చదివిన ఆమె మూడు విభాగాల్లో పీజీ పూర్తి చేశారు. […]
Hyderabad Metro Rail Ticket charges Hike: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో బిగ్ షాక్ తగలనుంది. త్వరలో మెట్రో ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా హైదరాబాద్ మెట్రో నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు మెట్రో ఛార్జీలు పెంచాలని ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకుంది. కరోనా తర్వాత నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మెట్రోను లాభాలు తీసుకొచ్చేందుకు గతంలోనే ఛార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఛార్జీల పెంపు విషయమై అప్పుడు […]
Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో రద్దీ కనిపిస్తోంది. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రహదారుల విస్తీర్ణం పెరగడం లేదు. దీంతో కొద్ది దూరానికే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏదైనా అత్యవసర పనికోసం బయటకు వెళ్తే ఇక అంతే సంగతులు. మరోవైపు నగరంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే పలు కూడళ్లలో సిగ్నల్స్ వ్యవస్థను తీసివేసి.. యూటర్న్ […]
Ranganayaka Sagar : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను మిరాజ్ (15), అర్బాస్ (15)గా గుర్తించారు. వరంగల్‌కు చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో రంగనాయక్ సాగర్ వద్ద రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆగారు. ఈ క్రమంలోనే సరదాగా ఈత కొడుతున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు నీట మునిగారు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు […]
Deputy CM Bhatti Vikramarka : కేంద్రం కులగణనపై తీసుకున్న నిర్ణయం తెలంగాణ సర్కారు విజయానికి నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని మల్లన్నపాలెంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కులగణనను చేపట్టిందన్నారు. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు […]
Former Minister Harish Rao : తెలంగాణకు మంజూరైన నరేగా పని దినాలను కేంద్రం సగానికి తగ్గించడం శోచనీయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలను మంజూరు చేసిందని, ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేయగా, సీఎం రేవంత్‌రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా సాధించిందేమీ లేదని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెరో 8 సీట్లు వచ్చానా […]
Telangana: తెలంగాణలో రానున్న మూడురోజుల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడె, నల్గొండ, జనగాం, సూర్యాపేట, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ లోనూ రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు […]
DOST 2025 : రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 21 తేదీ వరకు ఆన్లైన్లో రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 29న మొదటి […]
Trains Cancelled : నిర్వహణ పనుల వల్ల చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చర్లపల్లి-తిరుపతి (రైలు నెం.07257) ఈ నెల 8వ తేదీ నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (రైలు నెం. 07258) ఈ నెల 9వ తేదీ నుంచి 30 వరకు అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు. కాజీపేట-తిరుపతి (రైలు నెం. 07253) ఈ నెల 6వ తేదీ నుంచి 25 వరకు, తిరుపతి-కాజీపేట (రైలు నెం. […]
Congress BC Leaders : టీ కాంగ్రెస్ బీసీ నేతలు శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలో గవర్నర్‌ను కలిశారు. బీసీలకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ, శాసన మండలిలో చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపినందుకు టీ కాంగ్రెస్ బీసీ నేతలు ధన్యవాదాలు […]