Home / PM Modi
సనాతన ధర్మం చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు G20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన -- ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు.ప్రపంచంలో శాంతి నెలకొనాలి అని స్థూలంగా అనువదించే ఈ నినాదం, G20 డిక్లరేషన్ శనివారం ఆమోదించబడిన నేపథ్యంలో ఇవ్వబడింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈరోజు వరకూ ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు. ప్రఫుల్ పి.శారద అనే దరఖాస్తుదారు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయం ఈ సమాధానం ఇచ్చింది.
రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని ఢిల్లీలోని పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు కట్టారు. X లో పంచుకున్న వీడియోలో, పాఠశాల విద్యార్థినులు ప్రధాని మోదీ కి రాఖీలు కట్టడం కనిపించింది.
తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండేందుకు అక్రమంగా సరిహద్దులు దాటిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర అగ్రనేతలకు రాఖీలు పంపినట్లు తెలిపింది.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో 10 వ సారి మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. కాగా ఈ వేడుకలకు కార్మికులు, రైతులతో పాటు 1800 మందికి పైగా ప్రత్యేక అతిథులు
కాంగ్రెస్ వంశ పారంపర్య రాజకీయాల కారణంగా శరద్ పవార్ ప్రధాని కాలేకపోయారని, మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
తనకు ప్రదానం చేసిన లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు పురస్కారం మొత్తాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. నేను బహుమతి డబ్బును నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ అవార్డును దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నానని మోదీ అన్నారు.
మణిపూర్‌పై కొనసాగుతున్న పార్లమెంటు ప్రతిష్టంభన నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విపక్ష కూటమి ఇండియాపై తీవ్రమైన విమర్శలను గుప్పించారు. దేశం పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించలేమని అన్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ విపక్షాలు నిరాశ మరియు నిరుత్సాహానికి గురయ్యాయని అన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తన రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకారం, ఈ సంవత్సరం రెండు దేశాలు దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు జరుపుకుంటున్నాయి. భారతదేశం-శ్రీలంక దీర్ఘకాల సంబంధాలను సమీక్షించడానికి మరియు మరింత ఊపందుకోవడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని సూచిస్తుంది.