Home / PM Modi
భారత దేశ నూతన పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అంగరంగా వైభవంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా జరిపిన హోమాలు, భక్తి శ్రద్ధలతో చేసిన పూజల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్ సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, పలువురు ముఖ్యమంత్రుల, ఎంపీలు, గవర్నర్లు, తమిళనాదు ఆధీనమ్ ల మఠాధిపతులు పాల్గొన్నారు. ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నమైన రాజదండం(సెంగోల్ ) ను ప్రధాని మోదీ ఈ నూతన పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ కుర్చీకి సమీపంలో ప్రతిష్టించారు.
:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రతి దేశం యొక్క అభివృద్ధి ప్రయాణంలో, కొన్ని క్షణాలు అజరామరంగా మారతాయి మే 28 అటువంటి రోజని ప్రధాని మోదీ అన్నారు. కొత్త పార్లమెంటు ను ప్రారంభించిన సందర్బంగా మొదటిసారి ఆయన పార్లమెంట్లో ప్రసంగించారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్వీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, ఎంపీలు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.
New Parliament: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని భారత ప్రభుత్వం నిర్మించింది.
నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28 ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిహ్కరించిన విషయం తెలిసిందే.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Niti Aayog : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరోగ్యం, స్కిల్ డెవలెప్మెంట్, మహిళా సాధికారత, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు. 2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ని సిద్దం చేయనున్నారు. నీతి అయోగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల నేతలు, […]
New Parliament: భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. సకల హంగులతో ఈ పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.
భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య బంధం క్రికెట్‌కు మించినదని, ఇది మనలను చారిత్రాత్మకంగా అనుసంధానించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం జీ 7 సమ్మిట్ లో భాగంగా జపాన్ లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో మోదీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒడిశాలో మొదటి వందే భారత్ రైలును (పూరీ-హౌరా)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రయాణించే రెండవ వందే భారత్ రైలు కావడం విశేషం.