Home / Pakistan
వరదల ధాటికి పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. గత 24 గంటల్లోనే 119 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
భారీ వర్షాలకు పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాక్ ప్రభుత్వం గురువారం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
ఆసియా కప్ లో దాయాది పాకిస్థాన్‌తో ఆదివారం రాత్రి టీమ్ ఇండియా తలపడుతోంది. పాక్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుపొందిన తర్వాత రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. అయితే ఇండియాతో మ్యాచ్ కు ముందే పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని స్టార్ ప్లేయర్ ఒకరైన షాహీన్ అఫ్రిది మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై టెర్రరిజం చార్జీ ఫైల్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది .గత శనివారం నాడు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అధికారులను, జడ్జిలను బెదిరించారని, సైన్యాన్ని తిరుగుబాటు చేయాలని రెచ్చగొట్టారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తనను అరెస్టు చేయకుండా ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనను గురువారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
పాకిస్తాన్లో వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలంటే చక్కటి ఆయుధం బ్లాస్‌పేమి లేదా దైవ దూషణ. అల్లాను నిందిచాడని లేదా ఖురాన్‌ను అగౌరవ పరచాడంటూ నేరం మోపి చంపేసిన ఘటనలు పాక్‌లో కొకొల్లలు. అలాగే జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య లెక్కేలేదు.
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది దుర్మరణం పాలవ్వగా, ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. ముల్తాన్ - సుక్కూర్ మోటార్‌వేలో ఆయిల్ టాంకర్‌ను ప్యాసింజర్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన ఓ యువతితో పాటు ఆమెకు సహాకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని ప్రేమించిన కలీజా నూర్ అనే యువతి పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ నుంచి హైదరాబాద్ లో ఉన్న ప్రియుడు అహ్మద్ వద్దకు వచ్చే ప్రయత్నం చేసింది.
భారీ వర్షాలతో పాకిస్తాన్ వణుకుతోంది. ఎడతెరిపిలెకుండా కురుస్తున్న వానలకు నెల రోజుల్లో 148 మంది మృత్యువాతపడినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు వంతెనలు కొట్టుకొని పోయాయని.. దేశ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాక్ అధికారులు తెలిపారు.