Home / Pakistan
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది దుర్మరణం పాలవ్వగా, ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. ముల్తాన్ - సుక్కూర్ మోటార్వేలో ఆయిల్ టాంకర్ను ప్యాసింజర్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన ఓ యువతితో పాటు ఆమెకు సహాకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తిని ప్రేమించిన కలీజా నూర్ అనే యువతి పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ నుంచి హైదరాబాద్ లో ఉన్న ప్రియుడు అహ్మద్ వద్దకు వచ్చే ప్రయత్నం చేసింది.
భారీ వర్షాలతో పాకిస్తాన్ వణుకుతోంది. ఎడతెరిపిలెకుండా కురుస్తున్న వానలకు నెల రోజుల్లో 148 మంది మృత్యువాతపడినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు వంతెనలు కొట్టుకొని పోయాయని.. దేశ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాక్ అధికారులు తెలిపారు.